కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ హీరోల ఆదాయంలో పవన్ కన్నా ముందు స్థానంలో నిలిచిన మహేష్ టాలీవుడ్ ఎంపరర్ కు మరో షాక్ ఇచ్చాడు. ఈ సంవత్సరంలో తాను నటించిన రెండు సినిమాలు ఘోర పరాజయం చెందినా తన ఇమేజ్ ఏ మాత్రం తగ్గ లేదని అందరికీ తెలిసి వచ్చేలా చేసాడు. ఈ సంవత్సరానికి గూగుల్ సెర్చ్ రికార్డులను గూగుల్ ప్రకటించింది. 2014 సంవత్సరానికి సంబంధించి టాలీవుడ్‌లో టాప్ మోస్ట్ సెర్చ్‌డ్ హీరోగా మహేష్ బాబు ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడని గూగుల్ ప్రకటించింది. ఆ తర్వాతి స్థానాన్ని స్టైలిష్ట్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. అయితే పవన్ కల్యాణ్, మెగా స్టార్ చిరంజీవి, ప్రభాస్ లను పక్కకు పెట్టి అల్లుఅర్జున్ రెండవ స్థానాన్ని అందుకోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  బన్నీ నటించిన ‘రేసు గుర్రం’ ఈ సంవత్సరపు బ్లాక్ బస్టర్ గా మారి 60 కోట్లు వసూలు చేయడం వాస్తవమే అయినా ఏకంగా పవన్, ప్రభాస్ ల ఇమేజ్ ని అధిగమించి బన్నీ ఏకంగా గూగుల్ మోస్ట్ సెర్చ్‌డ్ రికార్డులలో రెండవ స్థానం పాడడం సంచలనంగా మారింది.  అంతేకాదు రాజకీయాలలోకి వెళ్ళి గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్న మెగా స్టార్ చిరంజీవి ర్యాంకింగ్ పవన్ ర్యాంకింగ్ కన్నా ముందు స్థానంలో ఉండటం కూడా షాకింగ్ గా మారింది. ఏమైనా ఈ సంవత్సరానికి సంబంధించి గూగుల్ ప్రకటించిన మోస్ట్ సెర్చ్‌డ్ రికాడ్స్ టాప్ హీరోల అభిమానులందరినీ ఆశ్చర్య పరిచే విధంగా ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: