కోలీవుడ్ టాప్ హీరో విక్రమ్ కు ఆరోగ్యం బాగాలేదు అంటూ గత రెండు రోజులుగా కోలీవుడ్ మీడియాలో వార్తల హడావిడి విపరీతంగా జరుగుతోంది. ఈవార్తలను ఆధారంగా చేసుకుని మన టాలీవుడ్ మీడియాలో కూడా విక్రమ్ ఆరోగ్య విషయమై ఆత్రుత వ్యక్త పరుస్తూ వార్తలు రాయడమే కాకుండా ఒక ఫోటోను తమ వార్తలకు ఆధారంగా పెడుతున్నారు.  అయితే ఇంత హడావిడి జరుగుతున్నా విక్రమ్ ఆరోగ్యం గురించి ఎటువంటి అధికారిక సమాచారం అతని కుటుంబ సభ్యుల నుండి అందక పోవడంతో ఈ గాసిప్పులు మరీ పెరిగి పోతున్నాయి. అయితే ప్రస్తుతం మీడియాలో హడావిడి చేస్తున్న విక్రమ్ ఫోటో నిజంగా విక్రమ్ కు సంబంధించినదేనా? లేదా ఎవరైనా మార్ఫింగ్ చేసారా? అనే అనుమానాలు విపరీతంగా వస్తున్నాయి.  ఒకవైపు విక్రమ్ నటించిన ‘ఐ’ సినిమా వచ్చేనెల తొమ్మిదవ తారీఖున విడుదలకు రెడీ అవుతూ ఉండటంతో ఈ సినిమాను కొనుక్కున్న బయ్యర్లకు విక్రమ్ ఆరోగ్య వార్తలు చాల టెన్షన్ పెడుతున్నాయని టాక్. అదేవిధంగా ఈ వారంలో జరుగుతుంది అని అనుకున్న ‘ఐ’ సినిమా తెలుగు వర్షన్ ఆడియో వేడుక హైదరాబాద్ లో జరగక పోవడంతో ఈ వార్తలకు, ఆడియో వేడుక జరగక పోవడానికి ఏమైనా లింక్ ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి.  ‘ఐ’ సినిమాలో ఎముకల గూడును తలపించే దేహం కోసం షూటింగ్ సమయంలో ఆహారపరంగా, వ్యాయామాల పరంగా శరీరాన్ని విక్రమ్ చాలా కష్టపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ గెటప్ కోసం విక్రమ్ తయారు కావడంలో ఆరోగ్య సమస్యలు వచ్చాయని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే మళ్ళీ ఈ వార్తలు ఇప్పుడు హడావిడి చేయడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది..   

మరింత సమాచారం తెలుసుకోండి: