మహాభారతంలో కర్ణుడు చనిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నట్లే సంక్రాంతి పండుగకు సందడి చేస్తుంది అనుకున్న ‘టెంపర్’ వాయిదాకు రకరకాల కారణాలు బయటకు వస్తున్నాయి. పూరి జగన్నాథ్ అత్యంత వేగంగా ఈ సినిమా షూటింగ్ ను నడిపించచడంతో ఈ సినిమా ఖచ్చితంగానే సంక్రాంతి రేసులో ఉంటుంది అనుకున్నారు అంతా.  కేవలం ఈ సినిమాకు సంబంధించిన 20 రోజులు షూటింగ్ పెండింగ్ లో ఉండగా జూనియర్ అన్న జానకి రామ్ చనిపోవడంతో ఈసినిమాకు అనుకోని బ్రేక్ పడింది. ఆ తరువాత జూనియర్ తన బాధను కూడా దిగమింగుకుని ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని ప్రయత్నించినా మళ్ళీ అనుకోనివిధంగా ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా వాయిదా పడింది.  దీనికి అనేక కారణాలు వినిపించినా యంగ్ హీరో సచిన్ జోషీతో బండ్ల గణేష్ కు ఉన్న ఆర్ధిక వ్యవహారాలు ‘టెంపర్’ వాయిదాను ప్రభావితం చేసింది అనే గాసిప్పులు ఫిలింనగర్ లో వినపడుతున్నాయి. ఫిలింనగర్ లో వస్తున్న వార్తల ప్రకారం బండ్ల గణేష్ సచిన్ జోషితో నిర్మించిన ‘ఆషికి 2’ రీమేక్ వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలకు కారణం అయిందని వార్తలు ఉన్నాయి. ‘నీజతగా నేనుండాలి’ సినిమాను పేరుకు బండ్ల గణేష్ నిర్మించినా దాని ఆర్ధిక వ్యవహారం అంతా సచిన్ జోషీ సపోర్ట్ తో నడిచింది అనే వార్తలు ఉన్నాయి. ఈసినిమా విడుదలై పరాజయం చెందినా ఈ సినిమాకు సంబంధించిన లెక్కల విషయంలో సచిన్ జోషీ ఎన్ని సార్లు అడిగినా బండ్ల గణేష్ స్పష్టమైన సమాచారం ఇవ్వక పోవడంతో ప్రస్తుతం వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది అనే టాక్ ఉంది.  ఈ కారణాలతో ప్రస్తుతం టెన్షన్ లో ఉన్న బండ్ల గణేష్ ఈ వ్యవహారం తేలే వరకు ‘టెంపర్’ సినిమా షూటింగ్ ను నిరవధికంగా వాయిదా వేసాడు అనే వార్తలు ఉన్నాయి. ఈ పరిస్థుతులలో ‘టెంపర్’ మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసుకుని ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియని అయోమయ పరిస్థితి అంటున్నారు. అందుకే కాబోలు ఈ పరిస్థితులను గ్రహించిన జూనియర్ ఈ సినిమా విషయాన్ని పక్కకు పెట్టి వచ్చే నెల 7వ తారీఖు నుండి సుకుమార్ దర్శకత్వంలో తాను నటించబోతున్న సినిమాకు వరస పెట్టి బల్క్ డేట్స్ ఇచ్చాడు అనే వార్తలు వినపడుతున్నాయి. ‘టెంపర్’ సమస్యలు తీరి విడుదలయ్యేది ఎప్పుడో?

మరింత సమాచారం తెలుసుకోండి: