ప్రిన్స్ మహేష్ బాబు కొత్త సినిమాను దర్శకత్వం వహిస్తున్న కొరటాల శివ చేసిన సూచనను కొరటాల ఎంత బలవంత పెట్టినా మహేష్ బాబు నో అని చెప్పాడని వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ లేటెస్ట్ సినిమాను ఏదోవిధంగా సూపర్ హిట్ చేయాలి అన్న తపనతో ఉన్న కొరటాల ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ను అన్ని ఎమోషన్స్ ఉన్న పాత్రగా ఎలా మలిచాడో అదేవిధంగా ఈ కొత్త సినిమాలో కూడా మహేష్ ను డిఫరెంట్ గా చూపెడుతునే మాస్ ను ఆకట్టుకునే విధంగా ఒక వెరైటీ ఫైట్ సీన్ కు ప్లాన్ చేసాడని టాక్.  మిర్చి సినిమాలో ప్రభాస్ చేసిన రైన్ ఫైట్ కు ఎంత పేరు వచ్చిందో అదే స్థాయిలో ఒక మాస్ ఫైట్ సీన్ ను ప్లాన్ చేసి కేవలం ఆ ఒక్క సీన్ లోను షర్ట్ లేకుండా నటించమని కొరటాల ఎంత బలవంత పెట్టినా మహేష్ ఒప్పుకోలేదని తెలుస్తోంది  ఈ ఒక్క సీన్ కోసం మహేష్ సిక్స్ ప్యాక్ లుక్ ను మళ్ళీ మరొక్కసారి చూపెట్టడానికి ఈ సినిమా యూనిట్ ఎంత బలవంత పెట్టినా మహేష్ ఒప్పుకోకుండా షర్ట్ లేకుండా నటించే ఎన్టీఅర్, బన్నీ, ప్రభాస్, రానాలు ఉండగా ఈ ప్రయోగాలు తన పై చేయవద్దు అంటూ సున్నితంగా కొరటాల శివ కోరికను తిరస్కరించాడని తెలుస్తోంది.  దీనిని బట్టి చూస్తూ ఉంటే ‘వన్’ సినిమాలో చేసిన ప్రయోగం ఫెయిల్ అవడంతో ఇక భవిష్యత్ లో ఇటువంటి సాహసాలు ఇక మహేష్ కలలో కూడా చేయడేమో అనిపిస్తోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: