ఒకవైపు సమంత తీరిక దొరికినప్పుడల్లా తన స్థాయిలో ప్రజాసేవ చేస్తూ ప్రజలను మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటే సమంత ప్రియ నేస్తం సిద్ధార్థ్ మటుకు ప్రజలను మార్చడం తన పనికాదు అంటూ ఘాటైన కామెంట్లు చేస్తున్నాడు. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్దార్థ్ ఈ ఆ శక్తికర వ్యాఖ్యలు చేసాడు.  ప్రజలను మార్చే పని గురించి ఎక్కువగా ఆలోచించే పనికన్నా ఒక పౌరుడిగా మన బాధ్యతను మనం సక్రమంగా నేరవేర్చగలిగితే అదే పెద్ద ప్రజా సేవ అని అంటూ ఈ దేశంలో అందరూ సక్రమంగా ఆదాయపు పన్ను చెల్లిస్తే అంతకు మించిన ప్రజాసేవ మరెక్కడా ఉండదని అసలు ఆ పని చేయకుండా ఎన్ని సామజిక కార్యక్రమాలు చేసినా ప్రయోజనం లేదు అని కామెంట్ చేసాడు సిద్ధార్థ్.  ఇప్పటి వరకు హిందీ, తెలుగు సినిమాలలో నటించినా అక్కడ తనకు రాని గుర్తింపు ప్రస్తుతం తనకు కోలీవుడ్ రంగంలో వస్తోంది అని అంటూ సిద్ధార్థ్ అన్ని పాత్రలు చేయగలడు అని అనిపించుకోవడం తనకు ఇష్టం అని అంటున్నాడు. మణిరత్నం వద్ద సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడే తనకు దర్శకత్వం పట్ల కోరిక ఉందని ఎదో ఒకరోజు ఒక మంచి సినిమాకు దర్శకత్వం వహిస్తాను అని అంటున్నాడు.  మంచి సినిమాలలో నటించి తన సత్తాను చాటాలని సమంత ఉబలాట పడుతున్న నేపధ్యంలో సమంత సిద్దార్ధ కోరికను గ్రహించి అతడి దర్శకుడిగా మార్చి తాను నటించే వెరైటీ సినిమాను తీస్తే బాగుంటుందేమో..     

మరింత సమాచారం తెలుసుకోండి: