ఈసారి నితిన్ చేస్తున్నంత సాహసం తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎప్పుడూ చేసి ఉండడు. తాను ఎన్నో ఆసలు పెట్టుకున్న ‘చిన్నదానా నీకోసం’ సినిమాను అత్యంత ధైర్యంగా మెగా కుటుంబ హీరో సినిమాకు పోటీగా విడుదల చేస్తూ నితిన్ కు ఇంత సాహసం ఎక్కడ నుంచి వచ్చింది అని అందరు అనుకునేడట్లుగా ప్రవర్తిస్తున్నాడు. తన సాహసానికి దేవుడి ఆశిస్సులు కూడా ఉండాలని కాబోలు ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సబ్యులతో కలిసి దర్శించుకున్నాడు. అంతేకాదు స్వామివారి సేవలలో కూడా పాల్గొన్నాడు. నితిన్ ను అర్చకులు ఆశ్వీరాదించి తీర్ధ ప్రసాదాలు అంద చేసారు.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన ప్రతి సినిమా విడుదలకు ముందు తిరుమలకు రావడం తనకు సెంటిమెంట్ అని చెపుతూ ‘తొలిప్రేమ’ చిత్రంలాగా 'చిన్నదాన నీకోసం' కూడా అందర్ని ఆకట్టుకుంటుందని అభిప్రాయ పడ్డాడు. ఈ సినిమాలో ప్యూర్ లవ్ స్టోరీతో పాటు కామెడీ కూడా ఉంటుందని చెప్పాడు. గత రెండు సినిమాలలో ప్రతి సినిమాలోను పాట పాడిన తాను ఈ సినిమాలో పాడక పోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమి లేదు అని అంటూ వచ్చే సినిమాలో తప్పకుండా పడతాననీ నవ్వుతూ చెప్పాడు. నితిన్ తో ఫోటోలు తీయించుకోవడానికి అతోగ్రాఫ్ లు పెట్టించు కోవడానికి అభిమానులు విపరీతంగా నితిన్ ను చుట్టముట్టారు. ఈ సాయంత్రం నితిన్ తిరుపతిలో తన ‘చిన్నదానా నీకోసం’ ఆడియో సక్సస్ మీట్ ను ఏర్పాటు చేసి తిరుపతి నుండి తన సినిమా పబ్లిసిటీ ప్రారంభిస్తున్నాడు నితిన్ కోర్కెలకు వెంకటేశ్వరస్వామి ఎటువంటి దీవెనలను అందిస్తాడో వచ్చే వారం తేలిపోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: