ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డ్-2014 పురస్కారానికి బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఎంపికయ్యారు అని ఈరోజు ఒక ప్రకటనలో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలియచేసింది. అక్కినేని జీవించి ఉన్న రోజులలోనే ఈ అవార్డును ఏర్పాటు చేసి భారతీయ సినిమా రంగానికి ఎన్నో సేవలు చేసిన అనేకమంది ప్రముఖులకు ఈ అవార్డుతో సత్కరించారు. గతంలో ఈ అవార్డును అందుకున్న వారిలో దేవానంద్, వైజయంతిమాల, శ్యామ్ బెనగల్, అంజలీదేవి, లతామంగేష్కర్, బాలచందర్ లాంటి ఎందరో ప్రముఖులు ఉన్నారు. అన్నపూర్ణా స్టూడియోస్ ఆధ్వర్యంలో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌ను స్థాపించి 2005 సంవత్సరం నుండి క్రమం తప్పకుండ ఈ పురస్కారాలను అందిస్తున్నారు.  భారతీయ చలనచిత్ర పరిశ్రమకు అసాధారణ సేవచేసి, అసాధారణ విజయాలు సాధించిన ప్రముఖులను ఈ అవార్డుతో సత్కరిస్తూ ఉంటారు. ఈ అవార్డు కింద 5 లక్షల నగదు తో పాటు సత్కారాన్ని కూడా చేస్తారు. బాలీవుడ్ లోనే కాకుండా భారతదేశం గర్వింప తగ్గ అసాధారణ నటుడు అమితాబ్ కు ఈసారి ఈ సత్కారం ఇవ్వడం పట్ల అందరు తమ హర్షాన్ని తెలియచేస్తున్నారు. ఈ నెల 27న ఈ అవార్డు కార్యక్రమo హైదరాబాద్ లో జరగబోతోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: