సంక్రాంతికి విడుదల కాబోతున్న ‘గోపాల గోపాల’ రిలీజ్ పోస్టర్లలో ఉపయోగించిన ‘సోలో గా వస్తున్నాం’ అనేపదం ఇప్పుడు టాలీవుడ్ లో తీవ్ర చర్చలకు దారితీసింది అనే వార్తలు వినపడుతున్నాయి. ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈమధ్యనే ఫిలిం చాంబర్ ఆఫీసులో చాలామంది టాలీవుడ్ నిర్మాతలు సమావేశమై ఎట్టి పరిస్తుతులలోను జనవరి 9వ తారీఖున విక్రమ్ శంకర్ ల ‘ఐ’ విడుదల కాకుండా చర్య తీసుకోవాలని ఫిలిం చాంబర్ పెద్దల పై తీవ్రమైన ఒత్తిడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు డబ్బింగ్ సినిమాలు పండుగలకు విడుదల కాకూడదు అని ఫిలిం చాంబర్ గతంలో తీసుకున్న నిబంధనలను గట్టిగా అమలు చేయాలని, అంతగా జనవరిలోనే ‘ఐ’ సినిమాను విడుదల చేసుకోవాలి అనుకుంటే సంక్రాంతి తరువాత వారం రోజుల గ్యాప్ తో విడుదల చేసుకోమని ఆ సినిమా నిర్మాతలకు సూచించాలని చాల గట్టి ఒత్తిడి ఫిలిం చాంబర్ పై వస్తోంది అనే వార్తలు వినపడుతున్నాయి.  అసలు ఈ వ్యవహారాన్ని తెరపైకి తీసుకు వచ్చింది బండ్ల గణేష్. తన ‘టెంపర్’ సినిమా కోసం ఈ డబ్బింగ్ సినిమాల రూల్స్ ను వెలుగులోకి తీసుకు వచ్చాడు బండ్ల గణేష్. అయితే ‘టెంపర్’ వాయిదా పడిపోయినా గణేష్ లేవనెత్తిన వ్యవహారం ఇప్పుడు క్లైమేక్స్ కు వచ్చింది. దీనితో పెద్ద సినిమాలు ఏమి పోటీలో లేకపోవడంతో గోపాల గోపాల రిలీజ్ పోస్టర్లలో ‘సోలో గా వస్తున్నాం’ అనే పదాన్ని చేర్చి ఉంటారు.  అయితే ఈ విషయాన్ని గ్రహించిన ‘ఐ’ సినిమా బయ్యర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనితో తెలుగులో కూడా ‘ఐ’ సినిమా పబ్లిసిటీ భారీ స్థాయిన చేయమని ఈ సినిమా దర్శక నిర్మాతల పై ఒత్తిడి పెరగడంతో రంగంలోకి దిగిన ఫిలిం చాoబర్ లోని ఒక వర్గం ఏదోవిధంగా ‘ఐ’ ను అడ్డుకోవాలని చూస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. ఒక విధంగా చూస్తే విడుదల కాకుండానే ‘ఐ’, ‘గోపాల గోపాల’ మధ్య వార్ ఆ శక్తి దాయకంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: