గత వారం ఎన్నో భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా 2500 థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలైన ‘లింగ’ సినిమాను భారీ మొత్తాలకు కొని తీవ్రంగా నష్టపోయిన బయ్యర్ల నుండి రజినీకాంత్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రజినీకాంత్ ను దేవుడుతో సమానంగా చూసే తమిళ ప్రేక్షకులు కూడా ‘లింగ’ సినిమా పై చూపెడుతున్న నిరాదరణ కోలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం తమిళనాడులో కూడా ఈ సినిమా ప్రదర్శింప బడుతున్న ధియేటర్లలో కనీసం సగం మంది కూడా జనం కనిపించడం లేదంటే ఈ సినిమా ఎటువంటి ఫ్లాప్ టాక్ తెచ్చుకుందో అర్ధం అవుతుంది. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్‌లలో 'లింగ' థియేటర్స్ సుమారు 50% లోపే ఫుల్ అవుతున్నాయని సమాచారం. ఈరోస్ సంస్థ నుండి భారీ రేటుకు కొన్న తమిళనాడు, తంజావూరు, తిరుచ్చి మరో రెండు ఏరియాల డిస్ట్రిబ్యూటర్స్ సమావేశమై త్వరలో సూపర్ స్టార్ రజనీని కిలిసి తమనష్టాల్ని భర్తీ చేయమని తమ బాధను చెప్పుకునే ఉద్దేశ్యంతో చాలామంది బయ్యర్లు ఉన్నారని కోలీవుడ్ మీడియా టాక్.  'కొచ్చాడయాన్'తో నష్టపోయిన బయ్యర్లు కనీసం 'లింగ' తో అయినా లాభాలు తెచ్చుకుందాము అనుకుంటే ఈ సినిమా కూడా వారిని తీవ్ర నష్టాలలో కూరుకుపోయేలా చేసింది అనే వార్తలు వస్తున్నాయి. గతంలో తన ‘బాబా’ విషయంలో నష్టపోయిన బయ్యర్లను ఆదుకున్న రజినీ ఈసారి ఎలా ప్రతిస్పందిస్తాడు అన్న విషయం పై సర్వత్రా ఆ శక్తి నెలకొని ఉంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: