సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్రేట్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న మూవీ బాహుబలి. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తైంది. మరి కొద్ది సన్నివేశాలు మినహా, బాహుబలి మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ ని జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ బాహుబలి మూవీలో నటిస్తున్న టాప్ లీడింగ్ యాక్టర్స్ అందరి ఫస్ట్ లుక్స్ బయటకు వచ్చాయి. వారిలో అనుష్క, ప్రభాష్, రానా లుక్స్ అదుర్స్ అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ప్రశంశలు అందుకుటున్నాయి. అయితే ఇదే మూవీలో మరో కీ రోల్ ని పోషిస్లున్న గ్లామర్ బ్యూటీ తమన్న కూడ ఉంది. అయితే తమన్న బాహుబలి మూవీలో నటిస్తుందనే కాని, ఇప్పటి వరకూ తమన్నకి సంబంధించి ఒక్క లుక్ ని కూడ బయటకు రిలీజ్ చేయలేదు, రాజమౌళి. దీంతో ఈ రోజు తమన్న పుట్టిన రోజు కానుకగా, బాహుబలి మూవీలో తమన్న పాత్రపై ఫస్ట్ లుక్ ని బయటకు రిలీజ్ చేశారు. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెసరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా అవంతిక పాత్రలో యువరాణిగా నటిస్తుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ బయటకు వచ్చిన వెంటనే, దీనిపై డివైట్ టాక్ వినిపిస్తుంది. అయితే ఈ ఫస్ట్ లుక్ పై తమన్న అంతగా సంతోషంగా లేనట్టు అనిస్తుంది.అంతే కాకుండా తనకి సంబంధించిన లుక్ కూడ చాలా క్యాజువల్ గా ఉన్నట్టుందని ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్. దీంతో తమన్న పైకి మాత్రం రాజమౌళిని పొగుడుతూనే, తన సన్నిహితులకి ఫోన్ చేసి, బాహుబలిలో తనపై రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ వరస్ట్ గా ఉందంటూ చెబుతుందట. ప్రస్తుతం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, తమన్నాలు బుల్గేరియాలో షూటింగ్ చేస్తున్నారు. ఈ భారి బడ్జెట్ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: