టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా పేరు సంపాందిచుకున్న హీరో ప్రిన్స్ మహేష్ బాబు. మహేష్ బాబు మూవీల కోసం ఎదురుచూసే ఫ్యాన్స్ ఎలా ఉన్నారో, అలాగే మహేష్ డేట్స్ కోసం ఎదరుచూసే నిర్మాతలూ కూడ అలాగే ఉన్నారు. ఇక దర్శకుల విషయానికి వస్తే చాలా మంది క్యూలో ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ మూవీలో మహేష్ బాబు చేత ఓ పనిని చేయంచటానికి కొరటాల శివ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో మహేష్ బాబుని కూడా సిక్స్ ప్యాక్ లో చూపించాలని కొందరు దర్శకులు ప్రయత్నించారు. ఆమధ్య 'వన్- నేనొక్కడినే' చిత్రంలో కూడా మహేష్ తో షర్ట్ విప్పించాలని దర్శకుడు సుకుమార్ బాగా ప్రయత్నించి చివరికి విఫలమయ్యాడు. తాజాగా కొరటాల శివ కూడా మహేష్ ని ఈ విషయంలో ఒప్పించాలని ప్రయత్నించాడట. అయితే, ఎట్టి పరిస్థితులలోనూ చొక్కా విప్పేది లేదని మహేష్ తేల్చి చెప్పడంతో దర్శకుడు శివ డీలా పడ్డాడని ఈ సినిమా యూనిట్ వర్గాలు అంటున్నాయి. మహేష్ చేత బాడీ బిల్డింగ్ చేయించాలని కొరటాల శివ ఆ విధమైన కొన్ని సీన్స్ ని స్పెషల్ గా రాసుకున్నాడంట. ఇప్పుడు మహేష్ బాబు, శరీరాన్ని చూపించుకునే సీన్స్ చేయనని చెప్పడంతో, కొరటాల శివ మళ్ళీ సీన్స్ ను మారుస్తున్నట్టు చిత్ర యూనిట్ నుండి వినిపిస్తున్న సమాచారం. అయితే కొరటాల శివ, మహేష్ సిక్స్ ఫ్యాక్ బాడీపై ఒత్తిడి చేయగా, అందుకు మహేష్ “ ఆ పాడు పని చేయను” అంటూ చెప్పుకొచ్చాడంట. 

మరింత సమాచారం తెలుసుకోండి: