సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు కోలీవుడ్ హీరో ధనుష్ అఖిల్ సమస్యకు పరిష్కారం చూపినట్లు వార్తలు వస్తున్నాయి. అఖిల్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమాకు అంతా రెడీ అయిపోయి ముహూర్తం క్లాపిoగ్ కుడా జరిగి పోయినా హీరోయిన్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్న నాగార్జున, వినాయక్ లకు అమేర దస్తూర్ ఒక పరిష్కారం చూపినట్లుగా వార్తలు వస్తున్నాయి.  ఈమె గత ఏడాది బాలీవుడ్ లో వచ్చిన ‘ఇష్క్’ మూవీ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ప్రతీక్ బబ్బర్ సరసన నటించింది. అలాగే ఈ బ్యూటీ ప్రస్తుతం ధనుష్ సరసన కె.వి ఆనంద్ దర్సకత్వంలో రూపొందుతున్న ఒక తమిళ సినిమాలో నటిస్తోంది. ఈమె ఈ సినిమాలో చేసిన కొన్ని సీన్స్ క్లిపింగ్స్ చూసిన వినాయక్, నాగార్జునలు ఈ బ్యూటీ అన్నివిధాలా అఖిల్ కి సరి జోడుగా సరిపోతుందని భావించి ఈమెను అఖిల్ ను కలిపి ఒక ట్రయిల్ షూట్ ను ఈ మధ్యనే అన్నపూర్ణ స్టుడియోలో చేసారని వార్తలు వస్తున్నాయి.  ఈ ట్రయిల్ షూట్ లో అఖిల్ అమేర దస్తూర్ ల మధ్య లవ్ కెమిస్ట్రీ బాగా కుదరడంతో ఇంచుమించుగా ఈమెను అఖిల్ కు కాబోయే హీరోయిన్ గా ఎంపిక చేసారు అనే వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఈమె ప్రస్తుతం విక్రమ్ భట్ డైరెక్ట్ చేస్తున్న మరో సినిమాలో కూడా నటిస్తోంది. అమేర కూడా అఖిల్ లాగే గతంలో వోడాఫోన్, మైక్రోమాక్స్ యాడ్స్‌లో నటించి బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.  అఖిల్ కు హీరోయిన్ సమస్య తీరిపోయింది కాబట్టి అఖిల్ సినిమా షూటింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది అని అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: