పవన్ ప్రస్తుతం నటిస్తున్న ‘గోపాల గోపాల’ షూటింగ్ పూర్తి కావడంతో చాలామంది ఈనెలలో ఎదో ఒకరోజు నుండి ఈ సంవత్సరం జనవరిలో కొబ్బరికాయ కొట్టిన ‘గబ్బర్ సింగ్ 2’ ని మొదలు పెడతాడు అని విస్తృతంగా గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ మధ్య పవన్ ‘జనసేన’ కు ఎలక్షన్ కమీషన్ నుండి అధికారక గుర్తింపు రావడంతో పవన్ ‘జనసేన’ నిర్మాణ భాధ్యతలకు ముందుగా ప్రాధాన్యత ఇచ్చి తన ‘గబ్బర్ సింగ్ 2’ ను మళ్ళీ వెనుకకు పెడతాడు అనే వార్తలు వినిపించాయి.  అయితే ఈ వార్తలకు తెరదించే ఉద్దేశ్యంతో పవన్ తన దూకుడు పెంచి తన డ్రీమ్ మూవీ ‘గబ్బర్ సింగ్ 2’ ను పట్టాలు ఎక్కిoచడమే కాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 10 రోజుల పాటు షూటింగ్ నిర్వహించడానికి యాక్షన్ ప్లాన్ రెడీ అయింది అనే వార్తల హడావిడి మొదలైంది. అంతేకాదు ఈ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే పవన్ అదే స్పీడ్ తో సెకండ్ షెడ్యూల్ పూర్తి చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లు ఫిలింనగర్ టాక్. ‘పవర్' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన బాబీ దర్శకత్వం వహించే ఈ సినిమాకు సంభందించిన పాటల మ్యూజిక్ సిటింగ్స్ అనూప్ రూబెన్స్ ఆధ్వర్యంలో జనవరిలోనే జరగబోతున్నాయనే వార్తల హడావిడి కూడా వినిపిస్తోంది.  కధనుంచి డైలాగ్స్ వరకు అన్నింటా తానై పవన్ నేతృత్వంలో ఒక యంగ్ రైటర్స్ టీమ్ తయారుచేసిన స్క్రిప్ట్ పూర్తి కావడంతో పవన్ ఈ దూకుడు నిర్ణయం తీసుకున్నాడని విశ్వసనీయ సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: