తన వీరాభిమాని నితిన్ ‘చిన్న దాన నీకోసం’ ఆడియో ఫంక్షన్ కు అతిధిగా రమ్మని ఎన్ని సార్లు పిలిచినా రాని పవన్ కళ్యాణ్ నితిన్ కోసం తన మనసు మార్చుకుని ఈ సినిమా కోసం ఒక ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ‘చినదాన నీకోసం’ సినిమాలో పవన్ ఫ్యాన్స్ కు ఓ సర్ ప్రయిజ్ వుంటుందని మాత్రం తెలుస్తోంది.  ఈ సర్ ప్రయిజ్ సెకండాఫ్ లో ఉంటుందని టాక్. కొందరైతే ఏకంగా ఒక చిన్న సన్నివేశంలో పవన్ కనిపిస్తాడు అని చెపుతూ ఉంటే మరి కొందరైతే పవన్ మాస్క్ పెట్టుకుని నితిన్ వెండితెర పై హడావిడి చేస్తాడు అని చెపుతున్నారు. వస్తున్న ఈ వార్తల హడావిడి చూస్తూ ఉంటే పవన్ ప్రస్తావన ఈ సినిమాలో చాల గట్టిగానే ఉంటుందని అనిపిస్తోంది.  నితిన్ స్వయంగా పవన్ వీరాభిమాని కావడమే కాకుండా ఈ సినిమా దర్శకుడు కరుణాకరణ్ కు పవన్ కు ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఈ సినిమాలో పవన్ కు సంబంధించిన ఎదో ఒక మ్యాజిక్ ఉండటం ఖాయం అని అనిపిస్తోంది. ఈ విషయాన్ని సినిమా ఫిలిం యూనిట్ కూడా ఖండించకుండా నవ్వుతూ ఈ వార్తల హడవిడిని మరింత పెంచి క్రేజ్ తెస్తున్నారు.  ఇది ఇలా ఉండగా ఎల్లుండి విడుదల కాబోతున్న ఈ సినిమా పై ఫిలిం నగర్ లో మిక్స్ డ్ ప్రీ రిలీజ్ టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ బాగానే నడిచినా సెకండాఫ్ కాస్త వీక్ అని టాక్. అయితే ఆ సెకండ్ ఆఫ్ లొ కొన్ని ట్విస్ట్ లు వుండడం వల్ల అవి క్లిక్ అయి సినిమాను హిట్ చేస్తాయి అనే మాటలు వినిపిస్తున్నాయి.  ఒకవైపు తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కొడుకు వరుణ్ తేజ్ సినిమాల దూరంగా ఉన్న పవన్ నితిన్ కోసం పవన్ తన మనసును మార్చుకుంటే మెగా కుటుంబానికే కాదు మెగా అభిమానులకు కూడా పెద్ద షాక్..   

మరింత సమాచారం తెలుసుకోండి: