సంచలన వార్తలకు గాసిప్పులకు ఎప్పుడూ చిరునామాగా ఉండే రానా తన తండ్రి సురేష్ బాబు కోరిక తీర్చలేక పోయాను అంటూ నిన్న తన ఫేస్ బుక్ లో కామెంట్స్ పెట్టుకున్నాడు. రానా ను హీరోగా చూద్దామని నిర్మాత సురేష్ బాబు ఎప్పుడూ అనుకోలేదట. రానాను ‘మిచిగాన్ యునివర్సిటీ’ కి పంపించి ఉన్నత చదువులు చదివించాలని సురేష్ బాబు కోరిక అట. అయితే తన తండ్రి కోరికకు తగ్గట్టుగా తాను ఎప్పుడూ ప్రవర్తించలేకపోయాను అని అంటున్నాడు రానా. గ్రాడ్యుయేషన్ పూర్తి కాకుండానే చదువుకు బైబై చెప్పేసి వ్యాపారంలోకి దిగిన రానా అదీ నచ్చక మనసు సినిమా రంగం పై మోజు పడటంతో సినిమాల వైపు పరుగులు తీసాడు రానా.  అయితే తన తండ్రి తన మనసు మార్చాలని ఎన్నో సార్లు ప్రయత్నిస్తూ ‘మిచిగాన్ యూనివర్సిటీ’ లోగోతో ఉన్న క్యాప్ ను, బ్యాగ్ ను తన గదిలో పెట్టినా దానిని షో పీస్ కింద తన గదిలో ఉంచుకున్నాను కాని ఆ క్యాప్ ప్రభావం తన పై ఏ విధంగా పనిచేయకపోవడంతో తన తండ్రి కోరిక తీర్చలేకపోయాను అని బాధ పడ్డాడు రానా.  అయితే కనీసం రానా తన తండ్రి సురేష్ బాబు కోరుకుంటున్నట్లుగా తన పెళ్ళి విషయంలో తన తండ్రి కోరిక తీరుస్తాడా? లేదంటే చదువు విషయంలో మాట విననట్లుగానే ప్రేమ వివహం చేసుకుంటాడా అనే విషయం రానున్న రోజులలో తేలుతుంది..     

మరింత సమాచారం తెలుసుకోండి: