జనవరి ఫస్ట్ దగ్గర పడుతూ ఉండటంతో బాలయ్య అబిమానులలో టెన్షన్ పెరిగి పోతోంది. దీనికి కారణం డిసెంబర్ 31 అర్దరాత్రి బాలకృష్ణ కొత్త సినిమా టీజర్ విడుదల కాబోతు ఉండటం. అయితే ఈ సినిమాకు సంబంధించిన ‘లయన్’ టైటిల్ కన్ఫ్యూజన్‌ ఇంకా కొనసాగుతూ ఉండటంతో ఒకవేళ ‘లయన్’ టైటిల్ అధికారికంగా రాకపోతే ‘NBK లయన్’ అని ఈ సినిమాకు టైటిల్ పెట్టవలసిందిగా ఈ సినిమా దర్శక నిర్మాతలను బాలకృష్ణ అభిమానులు కోరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాము నందమూరి సింహంగా అభిమానంగా పిలుచుకునే బాలయ్యను ఈ సినిమాలో ‘వారియర్’ గా కాకుండా ‘NBK లయన్’ గా చూడాలని అభిమానుల కోరిక. అయితే ఈ కోరికను ఎంత వరకు ఈ సినిమా దర్శక నిర్మాతలు మన్నించ గలుగుతారో చూడాలి.  ఈ వార్తలు ఇలా ఉండగా బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాల సెంటిమెంట్ ను అనుసరించి రామోజీ ఫిల్మ్ సిటీలో రైల్వే స్టేషన్ సెట్‌లో భారీ ఫైట్ ప్రస్తుతం బాలయ్య పై షూట్ చేస్తున్నారు. బాలకృష్ణ సినిమాల్లో రైల్వే స్టేషన్ ఫైట్ ఉందంటే అది హిట్ అవుతుందనే సెంటిమెంట్ తో ఈ ఫైట్ డిజైన్ చేశారని యూనిట్ టాక్.  ఇప్పటికే ఈ మూవీలో లుంగీతో మాస్ లుక్‌లో ఉన్న బాలయ్య ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌లో జోష్ పెంచగా, పంజాబీ స్టైల్ గెటప్‌ తో మీసం మెలేస్తున్న బాలకృష్ణ లుక్ ఫోటో ఇప్పుడు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య తన అభిమానుల కోరికను తీరుస్తాడా? లేదంటే ‘వారియర్’ గానే వస్తాడా ? అనే విషయం సస్పెన్స్..

మరింత సమాచారం తెలుసుకోండి: