పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై రూమర్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కాదు. పవన్ కళ్యాణ్ ఫిల్మ్ కెరీర్ ని ఎంత స్లోగా రన్ చేస్తుంటే, అంతే ఎక్కువుగా తన ఫిల్మ్ కెరీర్ కి సంబంధించిన న్యూస్ లు గాసిప్స్ రూపంలో బయటకు వస్తున్నాయి. గతంలో కోలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన కత్తి మూవీని తెలుగులో పవన్ కళ్యాణ్ రిమేక్ చేస్తాడంటూ.. హడావిడి క్రియేట్ అయింది. తీరా చూస్తే, పవన్ కళ్యాణ్ ఆ మూవీని చూసి, రిమేక్ చేయండం ఇంట్రెస్ట్ లేదని చెప్పడంతో, ఆ వార్తలకి పుల్ స్టాప్ పడింది. ఇప్పుడు ఈ తరహా న్యూస్ ఒకటి, పవన్ కళ్యాణ్ విషయంలో దుష్రచారం జరుగుతుంది. రీసెంట్ గా బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రిలీజ్ అయిన అమీర్ ఖాన్ పి.కె మూవీని, తెలుగులో పవన్ కళ్యాణ్ రిమేక్ చేస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నాడనే న్యూస్ సౌత్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్ళితే, అమీర్ ఖాన్ నటించిన పి.కె మూవీని పవన్ కళ్యాణ్ తెలుగులోకి రిమేక్ చేయడంలేదు. అంతే కాకుండా పి.కె తరహా మూవీ సబ్జెట్స్ నటించటానికి పవన్ కి ఎంత మాత్రం ఇష్టం లేదంట. ప్రస్తుతం పి.కె మూవీకి సంబంధించిన కలెక్షన్స్ బాగా తగ్గిపోతున్నాయి. అంతే కాకుండా పి.కె మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆధరించలేకపోయిందనేది బిటౌన్ ఓపెన్ రిపోర్ట్. గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ ప్రెండ్ శతర్ మరార్, పి.కె మూవీ హక్కుల తెగ ప్రయత్నం చేస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లోనూ ఎంత మాత్రం నిజం లేదని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న క్లియర్ టాక్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: