ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రజనీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవ్వరికీ లేదనే చెప్పాలి. ఎందుకంటే అందరి హీరోలకి ఫ్యాన్స్ ఉండటం వేరు, రజనీకాంత్ కి ఫ్యాన్స్ ఉండటం వేరు. తాతల వయస్సు వచ్చినా, రజనీకాంత్ ఫ్యాన్స్ పెరుగుతున్నారే తప్పితే, ఏనాడూ తగ్గే ప్రసక్తే కనిపించడం లేదు. ఇక ప్రత్యేకంగా కోలీవుడ్ విషయానికి వస్తే, ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు అందరూ రజనీకాంత్ అభిమానులే. అటు స్టార్ యాక్టర్స్ తో పాటు, ఇంటర్నేషనల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని కలిగివున్న ఏకైన స్టార్ గా రజనీకాంత్ ది డిప్రెంట్ స్టైల్. ఇదిలా ఉంటే కోలీవుడ్ లో రజనీకాంత్ కి సంబంధించిన వ్యవహారంలో 24 కేసులు నమోదు అయ్యాయి. ఇదంతా తమిళనాడులో జరగటం ఆశ్ఛర్యకరంగా మారింది. తాజాగా రజనీకాంత్ నటించిన లింగా మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ రిలీజ్ అనంతరం, దీనిపై డివైడ్ టాక్ బయటకు వచ్చింది. కొంత మందైతే లింగ మూవీ ఏ మాత్రం బాగోలేదంటుంటే, మరికొందరు లింగ మూవీ ఎలాగున్నా రజనీకాంత్ సూపర్ అని అంటున్నారు. అయితే తమిళనాడులో కొంత మంది ఆకతాయిలు లింగ మూవీపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంట. దీంతో నిజమైన అభిమానులకి కోపం కట్టలు తెంచుకుంది. లింగ మూవీపై నెగిటివ్ ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి, వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయిన ఆ ఆకతాయిలు మాట వినకపోయేసరికి, వారిపై అభిమానులు, పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించారు. అలా దాదాపు 24 మందిపై అభిమానులు కేసులు నమోదు చేశారంట. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది ఆశ్ఛర్యపోతున్నారు. అయితే కొన్ని కేసులు పోలీస్ స్టేషన్ లోనే పోలీసులు పరిష్కారం చేసి పంపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: