బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కి షాకింగ్ న్యూస్ ఒకటి ఎదురైంది. ఎందుకంటే తను ఎంతగానో ఇష్టపడి చేసిన పి.కె మూవీ విషయంలో తన అంచనా తప్పైందట. ఎందుకంటే పి.కె మూవీ రిలీజ్ అయిన తరువాత, ఈ మూవీ దాదాపు 300 వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ అవలీలగా సాధిస్తుందనేది నిర్మాతల అంచనా. ప్రస్తుతం ఈ లెక్కలు పూర్తిగా మారిపోతున్నాయి. పి.కె మూవీ వంద కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది కాని, 200 వందల కోట్ల రూపాయల వైపు దూసుకుపోవటానికి చాలా సమయం పడుతుంది. ఇక మూడు వందల కోట్ల రూపాయల కలెక్ట్ చేస్తుందా? లేదా? అనేది ప్రశ్నార్ధం గా ఉంది. దీనంతటి కారణం, తను పి.కె మూవీలో ఎంచుకున్న సబ్జెక్ట్ అనేది యూనివర్సల్ సబ్జెక్ట్ కాకపోవడమే. కొంత మంది పి.కె మూవీలోని సబ్జెక్ట్, కొంత మందినే టార్గెట్ చేసుకొని వచ్చిందంటూ బిటౌన్ లో టాక్స్ లో వినిపిస్తున్నాయి. అంతే కాకుండా పి.కె మూవీలో కొన్ని సీన్స్ ని తొలగించాలని ఇప్పటికీ కొన్ని కేసులు కోర్టులో నడుస్తూనే ఉన్నాయి. మొత్తంగా బిటౌన్ బిజినెస్ ట్రేడ్స్ అందిని రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీ 200 నుండి 220 కోట్ల రూపాయల లోపు బాక్సపీస్ వద్ద కలెక్షన్స్ కొల్లకొడుతుందని చెబుతున్నాయి. అయితే పి.కె మూవికి దాదాపు 180 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. అందరి రె మ్యునరేషన్స్, అలాగే షేర్స్ కలుపుకుంటే ఇంత బడ్జెట్ వచ్చిందని బిటౌన్ రిపోర్ట్. పి.కె మూవీపై నిర్మాతలకి భారీ లాభాలు రాకపోయినా, కొద్ది లాభాలతో సరిపెట్టుకోవచ్చని ట్రేడ్ రిపోర్ట్ చెబుతుంది. ఈ రిపోర్ట్స్ ని తాజాగా అమీర్ ఖాన్ చూసి షాక్ అయ్యాడంటూ బిటౌన్ లో ప్రచారం జరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: