టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో యాంకర్స్ హడావిడి ప్రస్తుతం ఎక్కవుగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో యాంకర్స్ చాలా గ్లామరస్ గా కనిపిస్తున్నారు. గతంలో యాంకర్స్ కేవలం యాంకరింగ్ మాత్రం చేసుకొని వెళ్లేవారు. ఇప్పుడు మాత్రం అలా కాదు. యాంకరింగ్ టాలెంట్ ఉన్నా, లేకున్నా... వారు మాత్రం వారి గ్లామర్ ని చూపించడంలో ఏ మాత్రం సందేహ పడటంలేదు. దీంతో తక్కువ సమయంలో నేటి తరం యాంకర్స్ బాగా పాపులర్ అవుతున్నారు. ఆ లిస్ట్ లో యాంకర్ అనసూయ మొదటి వరసలో ఉన్నారు. అయితే అనసూయకి అద్రుష్టం వెతుక్కుంటూ వస్తుంది. చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడాలి. కాని అనసూయ విషయంలో అలా జరగటం లేదు. తను ఊహించింది ఒకటైతే, ఇక్కడ మరోకటి జరుగుతుంది. బుల్లితెరలో కొద్దిగా పాపులర్ అయిందో..లేదో.. అప్పుడే తనని వెతుక్కుంటూ పవన్ కళ్యాణ్ అత్తారింటికిదారేది మూవీలో స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చింది. అయితే అనసూయ వ్యక్తిగత కారణాల వల్ల ఆ ఆఫర్ ని వదులుకోవలసి వచ్చింది. ఆ తరువాత తను లీడ్ రోల్ గా ఉంటూ ఓ మూవీ వస్తుంది. ప్రస్తుతం ఆ మూవీకి సంబంధించిన ప్రొగ్రెస్ నడుస్తుంది. ఈ ప్రాజెక్ట్ రన్నిగ్ లో ఉండగానే, మరో సన్పెన్స్ హార్రర్ సబ్జెక్ట్ కి అనసూయ ఓకె చెప్పేసింది. తనకి స్క్రిప్ట్ తెగ నచ్ఛడంతో వెంటనే ఆ మూవీకి తన డేట్స్ ఇచ్చినట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. దీంతో అనసూయ చేతిలో ఇప్పటి వరకూ రెండు మూవీలు ఉన్నాయి. అలాగే మరో నాలుగు స్టోరీల తన కోసం రెడీ గా ఉన్నాయి. తను నటిస్తున్న మూవీలలో ఏదైన ఒకటి సక్సెస్ సాధిస్తే చాలు, తన లక్ పూర్తిగా మారిపోయినట్టే అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: