బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కల్ఛర్, మరే ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఉండదు. ఎందుకంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరువాతనే ఏదేనా. అయితే తాజాగా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ యాక్టర్ ఒకరు సెట్ లో తాగేసి వచ్చి, నానా హడావిడి చేశారంట. దీంతో ఫిల్మ్ షూటింగ్ ని ఆరోజు ఆపేశారు. ఇదంతా సల్మాన్ ఖాన్ మూవీ షూటింగ్ జరగటంతో, ఇది హాట్ టాపిక్ గా మారింది. విషయంలోకి వెళితే సల్మాన్ ఖాన్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీలో కొన్ని సీన్స్ ని ముంబాయ్ స్లమ్ ఏరియాలో షూటింగ్ చేస్తున్నారు. అయితే ఆ సీన్స్ లో సల్మాన్ ఖాన్ ఉండాల్సి అవసరం లేదు. తనతో సంబంధం లేని కొన్ని సీన్స్ ని రెండు రోజుల షెడ్యూల్స్ లో ముంబాయ్ స్లమ్ ఏరయాలో షూటింగ్ జరుపుకుంటుంది. ఓ సీన్ లో ఫిమేల్ క్యారెక్టర్ డ్రింక్ చేసి, స్లమ్ ఏరియాలో దురుసుగా ప్రవర్తించాలి. నిషా అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఆ రోజు నిజంగానే లిక్కర్ తీసుకొని వచ్చి, షూటింగ్ లో నానా హడావిడి చేసింది. దీంతో తను సెట్స్ మీదకు వచ్చిన అతి కొద్ది సమయంలో ఆ రోజు షూటింగ్ కి పేకప్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్, ఈ న్యూస్ ని లైట్ తీసుకున్నాడని తెలుస్తుంది. అయితే నిషా చేసిన తన తప్పుని తెలుసుకొని తరువాత రోజు డైరెక్టర్ కి సారి చెప్పిందట. తను అలాచేయటానికి కారణం రాత్రి పూట ఎక్కవుగా మధ్యం సేవించటమే అని, షూటింగ్ ఉదయాన్నే ఉండటంతో తనకి ఇంకా ఆ మత్తు వదలేదని చెప్పుకొచ్చింది. మరోసారి అటువంటి తప్పు రిపీట్ కాకుండా చూసుకుంటానని చెప్పటంతో నిర్మాతలు కూడ, ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: