పవన్‌ కల్యాణ్‌ వెంకటేష్‌ లు నటిస్తున్న ‘గోపాల గోపాల’ సినిమాలోని శ్రియ లుక్ బయటకు వచ్చింది. వెంకటేష్ భార్యగా ఈ సినిమాలో నటిస్తున్న శ్రియ ఈ సినిమా పై చాల భారీ అంచనాలు పెట్టుకుంది. మధ్య తరగతి మహిళగా అత్యంత సాంప్రదాయ బద్దంగా కనిపిస్తున్న శ్రియ లుక్ ను బట్టి ఈ సినిమాలో ప్రతి పాత్రను అత్యంత సహజంగా ఎలా తీర్చిదిద్దారు అన్న విషయం అర్ధం అవుతోంది.  శ్రియ కెరియర్ అయిపోయింది అని అందరూ భావించిన నేపధ్యంలో ఈ సంవత్సరంలో విడుదలైన ‘మనం’ సినిమా ద్వారా శ్రియ తన ఇమేజ్ ని మళ్ళీ పెంచుకుంది. ‘గోపాల గోపాల’ సినిమాకు మాతృక అయిన ‘ఓమై గాడ్’ సినిమాలోని సన్నీ వేషాలలో చాల మార్పులు చేయడంతో గోపాలుడి సినిమాలో శ్రియ పాత్రను పెంచారు అని టాక్. అదీ కాకుండా వెంకటేష్, శ్రియాల మధ్య ఒక యుగళ గీతాన్ని కూడా ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మలుస్తూ ఉండటంతో సున్నితమైన ఈ సినిమా కధకు వీలైనంత వరకు కమర్షియల్ విలువలు తగ్గకుండా అటు క్లాస్ ఆడియన్స్ తో పాటు ఇటు మాస్ ఆడియన్స్ ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను అన్ని విధాలుగా తీర్చి దిద్దుతున్నారని టాక్.  హాట్ ఎక్స్ పోజింగ్ లు చేసే శ్రియ అత్యంత సాంప్రదాయబద్ధంగా కనిపిస్తున్న శ్రియ ఫోటో లుక్ అందర్నీ ఆకర్షిస్తోంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: