నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులు నెమ్మదినెమ్మదిగా జానకిరామ్ మృతి విషాదం నుండి బయట పడుతున్నారు. జానకిరామ్ మరణించడానికి ముందు అత్యంత ఘనంగా ఏర్పాటు చేసుకున్న ‘పటాస్’ ఆడియో వేడుకను రాబోతున్న కొత్త సంవత్సరం జనవరి 1వ తారీఖున ఏర్పాటు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తలను బట్టి కొత్తసంవత్సరానికి సంబంధించి టాలీవుడ్ లో జరగబోయే మొట్టమొదటి సినిమా కార్యక్రమంగా నందమూరి కుటుంబ ‘పటాస్’ ఆడియో వేడుక అవుతుంది. ఇప్పటి వరకు గతంలో ఎప్పుడూ జనవరి 1న సినిమా ఆడియో ఫంక్షన్ టాలీవుడ్ కు సంబంధించి జరిగిన సందర్భాలు లేవు.  ఇప్పుడారికర్డును ‘పటాస్’ యూనిట్ సొంతం చేసుకోబోతోంది. కళ్యాన్ రామ్ నిర్మాతగా తానే హీరోగా నటించిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మొట్టమొదటి సారిగా పోలీస్ ఆఫీసర్ గా హడావిడి చేయబోతున్నాడు. అయితే ఈ ఆడియో వేడుక ఘనంగా అంతకుముందు అనుకున్నట్లుగా ఘనంగా అభిమానులు ముందు నిర్వహిస్తారా? లేదా నిరాడంబరంగా ఒక ప్రముఖ హోటల్ లో నిర్వహిస్తారా? అన్న విషయం పై క్లారిటీ లేదు.  ఈ ఆడియో వేడుకకు జూనియర్ రావడం అన్నది ఖాయమే. అయినా బాలకృష్ణ వస్తాడా అన్న సందేహం కూడా వినపడుతోంది. ఏది ఎలా ఉన్నా ‘పటాస్’ హడావిడితో టాలీవుడ్ లో నూతన సంవత్సర హడావిడి ప్రారంభం కావడం ఖాయం అని అంటున్నారు..   

మరింత సమాచారం తెలుసుకోండి: