నందమూరి సింహం బాలకృష్ణ నటిస్తున్న కొత్తసినిమా టీజర్ డిసెంబర్ 31 అర్దరాత్రి విడుదల అవుతుంది అని వార్తలు వచ్చిన నేపధ్యంలో నందమూరి అభిమానులు అంతా ఆరోజు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తన అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఇస్తూ బాలకృష్ణ కొత్త గెటప్ తో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ లుక్ ను క్రిస్మస్ సందర్భంగా బయటకు వదిలారు.  సత్యదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలై నందమూరి అభిమానులకు మంచి జోష్ ను కలిగిస్తోంది. ఆ జోష్ ను మరింత పెంచే ఉద్దేశ్యంతో ఈ సెకండ్ లుక్ ను బయటకు వదిలినట్లు అనిపిస్తోంది. మొట్టమొదటి ఫస్ట్ లుక్ లో బాలయ్య మాస్ అవతారంలో మాసీగా కనిపిస్తే ప్రస్తుతం బయటకు వచ్చిన ఈ సెకండ్ లుక్ లో చాల గంభీరంగా అందంగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా పేరుకు సంబంధించి వివాదాల విషయంలో ఇంకా ఎటువంటి క్లారిటీ రాకపోవడంతో రాబోతున్న కొత్తసంవత్సరం మొదటి రోజున బాలయ్య తన సినిమా టైటిల్ కు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుని ఇంకా దర్పంగా ఎలా కనిపిస్తాడో అనే అంచనాల మధ్య నందమూరి అభిమానులు రాబోతున్న కొత్త సంవత్సరం గురించి ఆ శక్తిగా ఎదురు చూస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: