ఈ మధ్య కాలంలో తమ అందాలను ఆరబోస్తూ కోట్లను సంపాదిస్తున్న మన హీరోయిన్స్ కు సామజిక చైతన్యం బాగా ఎక్కువైపోయి రకరకాల సామజిక కార్యక్రమాలలో పాల్గొంటూ ఆ కార్యక్రమాల లక్ష్యాలకు ప్రచారం చేస్తున్నారు. ఈమధ్యనే తమన్నా ప్రధానమంత్రి మోడీ పిలుపుకు స్పందించి ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని చేపట్టింది.  శ్రుతిహాసన్ కూడా ‘ఎయిడ్స్’ వ్యాది పై అవగాహనా కలిగించడానికి ఒక స్పెషల్ వీడియోను తయారు చేసింది. ఇక సమంత విషయం చెప్పనక్కరలేదు. తన ప్రత్యూష ఫౌండేషన్ ద్వార ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది సమంత. ఇక ఈ లిస్టులో తాను కూడా ఉన్నాను అంటూ కాజల్ మూగజీవాల్ని రక్షించాలంటూ ఉద్యమిస్తున్న ‘పెటా (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్)’ కోసం ఫోటోకు పోజిచ్చింది. గతంలో ఇదే సంస్థ కోసం చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు న్యూడ్, సెమీ న్యూడ్ ఫోటోలు దిగి ప్రచారం కల్పించారు. అయితే ఈసారి అటువంటి పద్ధతికి వెళ్ళకుండా సర్కస్ లను నిషేధించండి అంటూ ఏడుస్తూ కాజల్ ఒక ఫోటోకు ఫోజు ఇవ్వడమే కాకుండా సర్కస్ లో ఏనుగులతో విన్యాసం చేయించే ఇనుప చువ్వను గుచ్చితే ఎలా భాధ, కన్నీళ్లు వస్తాయో తన కన్నీళ్ళ ద్వారా ప్రజలందరికీ తెలిసి వచ్చేడట్లుగా ఈ పోజు ఇచ్చింది కాజల్.  ఏమైనా కాజల్ కూడా సామజిక సేవ చేసే హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది..  

మరింత సమాచారం తెలుసుకోండి: