ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు జరుపు కుంటున్న క్రిస్మస్ ను పురస్కరించుకుని సమంత అందరికీ శుభాకాంక్షలు తెలపడమే కాకుండా తన హెల్త్ సీక్రెట్ ను తెలియ చేసింది. వరస పెట్టి చేస్తున్న షూటింగ్ లకు డుమ్మా కొట్టి ఈరోజు తన బందువులతో స్నేహితులతో హడావిడి చేస్తున్న సమంత తాను క్రిస్మస్ ను ఎంత ఆనందంగా జరుపు కుంటోoదో తెలియచేస్తూ ఆ ఫోటోలను తన ఫేస్ బుక్ లో పెట్టి హడావిడి చేస్తోంది. అంతేకాదు అందర్నీ ఎలాంటి నెగెటివ్ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా, ఆనందంగా జీవించాలని సూచిస్తోంది. దీనితో పాటు ఆరోగ్యకరమైన ఆహరం తీసుకుంటే అందరూ తన లాగే అందంగా మెరిసిపోతారని సలహాలు ఇస్తోంది సమంత. ఒకరి గురించి చెడుగా ఆలోచించడం తనకు తెలియదు అని అంటూ వేరే హీరోయిన్ల ఆఫర్లు తనకు రావాలని ఎప్పుడూ కోరుకోను అని చెపుతూ ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటమే తన ఆరోగ్య రహస్యం అంటోంది. ఈ సంవత్సరం సమంతకు తాను కోరుకున్న సూపర్ హిట్ కోలీవుడ్ లో ‘కత్తి’ సినిమా ద్వారా లభించడంతో టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో కూడా లక్కీ హీరోయిన్ గా మారిపోయింది సమంత. అందుకే రెట్టింపు ఉత్సాహంతో క్రిస్మస్ పండుగను సరదాగా జరుపుకుంటోంది ఈ క్యూట్ మాయలేడి..   

మరింత సమాచారం తెలుసుకోండి: