టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో డెబ్యూగా ఎంట్రి ఇచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుండి మరో కుర్రాడు హీరోగా పరిచయం అవుతున్నాడు అనే విషయం తెలిసినప్పటి నుండి, వరుణ్ తేజ్ నటిస్తున్న మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. దీంతో మూవీని డైరెక్టర్ ఏ విధంగా తీసి ఉంటాడు, అలాగే వరుణ్ తేజ్ ఏ విధంగా యాక్ట్ చేసి ఉంటాడు? వంటి విషయాలు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు సాధారణ సినీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తించింది. దీంతో ప్రేక్షకులలో వరుణ్ తేజ్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే వరుణ్ తేజ్ నటించిన ముకుంద మూవీ రిలీజ్ అయి, మెగా అభిమానులని నిరాశ పెట్టించదని అంటున్నారు. అలాగే ఎవ్వరూ ఊహించినంతగా ఈ మూవీ ఉండకపోవడంతో, వరుణ్ డెబ్యూ ఫిల్మ్ తనకి డ్యామేజ్ చేసిందనే టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అయితే ఆరడుగుల ఎత్తు, చక్కని రూపం, అమ్మాయిలను ఇట్టే ఆకట్టుకునే అందంతో వరుణ్ తేజ్ తొలిచూపులోనే సినీ ప్రేక్షకులని ఆకర్షించాడు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల వరుణ్ తేజ్ ను తెరపై చూపించిన విధానం బాగున్నప్పటికీ, శ్రీకాంత్ అడ్డాల ఈ తరహా కథతో సినిమా తెరకేక్కిస్తారని ప్రేక్షకులు ఎవ్వరూ ఊహించలేదు. ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమాకు కథ మేజర్ మైనస్ పాయింట్. వరుణ్ తన డెబ్యూ మూవీకి సరికాని సబ్జెట్ గా ముకుంద మూవీ నిలిచింది. మొత్తంగా భారీ ఎక్స్ పెక్టేషన్స తో వచ్చిన ముకుంద, బాక్సాపీస్ వద్ద డీలా పడిందంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: