నందమూరి బాలక్రిష్ణ తన అభిమానులకి ఓ గుడ్ న్యూస్ ని తీసుకురాబోతున్నాడు. ఇంత కాలం బాలక్రిష్ణ తన మూవీలతో అలరిస్తూ వస్తున్నాడు. కాని ఇప్పుడు బాలక్రిష్ణ అటు రాజకీయంగా అధికారంలో ఉంటూ జనాలకి ఎంతో కొంత మంచి చేయాలనే ఉద్దేశంతో తన కెరీర్ ని మార్చుకోవాలనుకుంటున్నాడు. అందుకు తన ఫిల్మ్ కెరీర్ నుండే ఆ మార్పుని కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకూ ఎన్నో వైవిధ్యభరిత చిత్రాలలలో నటించిన బాలక్రిష్ణ, త్వరలో ఓ పవర్ ఫుల్ పొలిటికల్ పాత్రలో నటించే అవకాశం ఉందని అంటున్నారు. సామాజిక సేవ చేస్తూ, సమాజంలో జరుగుతున్న చెడుని ఎదిరించే ఓ సగటు మనిషి, జీవితంలో ఎంత పైకి ఎదిగాడు? వంటి స్టోరిని బాలక్రిష్ణ సెలక్ట్ చేసుకున్నట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉంటున్న బాలక్రిష్ణ, ఈ తరహా కథని ఎంచుకోవడంతో, ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ మొదలయ్యాయి. బాలక్రిష్ణకి ఇప్పుడు ఈ తరహా సబ్జెట్స్ ఎంత వరకూ అవసరం, ఒక వేళ గవర్నమెంట్ ని తన సినిమాలో ప్రశ్నిస్తాడా? అనే ఆలోచనలు ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఏదేమైనా బాలక్రిష్ణ ఎంచుకున్న కథ మాత్రం చాలా పవర్ ఫుల్ గా ఉందని, ఇండస్ట్రీలో కొందరి పెద్ద మనుషుల వద్ద నుండి వినిపిస్తున్న టాక్. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ 2015, మార్చి నుండి ప్రారంభం కావచ్చని అంటున్నారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ మూవీలో బాలక్రిష్ణ సరసన హీరోయిన్స్ ఎవ్వరూ ఉండరూ. కేవలం స్టోరి డిమాండ్ చేసే సినిమా కాబట్టి, హీరోయిన్స్ అవసరం లేకుండానే స్టోరికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: