బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఓ హీరోయిన్ హాట్ టాపిక్ గా మారింది. ఆషికి మూవీతో బిటౌన్ ఫిల్మ్ స్టార్ ఐకాన్ మారిన బ్యూటీ శ్రద్ధా కపూర్. అయితే శ్రద్ధా కపూర్ కి ఎంత స్టార్ డం వచ్చిందో, అంత కంటే ఎక్కువుగానే స్టార్స్ తో ఎఫైర్స్ ఉన్నాయంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. 2014వ సంవత్సరం పూర్తి కావస్తుంది కాబట్టి, ఈ సంవత్సరంలో ఏ హీరోయిన్, ఎంత మంది సెలబ్రిటీలతో డేటింగ్ వ్యవరాలను నడిపిందంటూ ఓ ప్రముఖ ఛానల్ టెలికాస్ట్ చేసిన టివి కథనంతో ఇప్పుడు పెద్ద దుమారమే లేస్తుంది. 2014వ సంవత్సరంలో బిటౌన్ హీరోయిన్స్ అందరిలో శ్రద్ధాకపూర్, ఎక్కవ మంది సెలబ్రిటీస్ తో డేటింగ్ వ్యవహారాన్ని నడిపి, మొదటి వరుసలో ఉందంట. ఆ తరువాత పరిణితి చోప్ర కి రెండో స్థానం ఇచ్చారు. ఇక మూడో స్థానంలో ఇలియాన ఉంది. ఇలా ర్యాంకింగ్ లు ఇచ్చుకుంటూ వెళ్ళిన ఆ ఛానల్ పై శ్రద్ధాకపూర్ ఫైర్ అయిందట. “నా వ్యక్తిగత జీవితంలోకి వచ్చి, ర్యాంకింగ్స్ ఇవ్వటానికి ఎంత వరకూ మీకు రైట్స్ ఉన్నాయంటూ ప్రశ్నిస్తుంది. తను ఎవ్వరితోనైనా క్లోజ్ గా మాట్లాడితో, వారితో డేటింగ్ ఉందంటూ మీకు గాసిప్స్ రాసేస్తారా?” అంటూ ఫైర్ అయింది. అయితే శ్రద్దాకపూర్ 2014వ సంవత్సరానికి ఏకంగా 5గురితో రిలేషన్స్ ని మెయింటెన్ చేసినట్టుగా కథనాలు చెబుతున్నాయి. ఈ ర్యాంకింగ్స్ లో ఉన్న ట్విస్ట్ ఏంటంటే, మూడో స్టానంలో ఉన్న ఇలియాన మాత్రం ఈ విషయంలో నిరాశగా ఉందట. తన గురించి పూర్తిగా తెలుసుకోకుండానే, వారు ర్యాంకింగ్స్ ఇచ్చేశారు. వారు ఇంకొంచెం ఆలోచించి, బెటర్ ర్యాంక్ ఇస్తే బాగుండేది అంటూ ఇలియాన తనదైన శైలిలో సెటైర్ వేసిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: