సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న బ్యూటీ కాజల్. కాజల్ ఇటు పిల్మ్స్ లోనూ, అటు కమర్షియల్ యాడ్స్ తోనూ బిజిగా ఉంటుంది. ప్రస్తుతం కాజల్ చేతిలో 4 నాలుగు మూవీలు ఉన్నాయి. ఇటు తెలుగు, తమిళ చిత్రాలతో పాటు అటు బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఓ మూవీతో ఫుల్ బిజి షెడ్యూల్ ని గడుపుతుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా కాజల్ కి కామసూత్ర కండోమ్ యాడ్ ఆఫర్ ఒకటి వచ్చిందట. అయితే ఆ యాడ్ లో కాజల్ నటించాల్సిన అవసరం లేదంట. యాడ్ మొత్తంలో వేరే ఆర్టిస్ట్ లు కలిసి నటిస్తే, చివర మాత్రం ఆ బ్రాండ్ పేరుని తను చెబితే సరిపోతుందని ఆ కంపెని చెబుతుంది. ఈ ఆఫర్ వచ్చి నెల రోజులవుతున్నప్పటికీ కాజల్ ఇప్పటి వరకూ ఎటువంటి విషయాన్ని ఆ కంపెనీకి చెప్పలేదు. వారు ఇచ్చిన గడుపు మరో రెండు రోజుల్లో పూర్తి కావొస్తుంది. ఇపుడు తను ఆ యాడ్ ని ఒప్పుకుంటుందా? లేదా? అనేది తనకి పెద్ద ప్రశ్నగా మారింది. తన స్నేహితుల వద్ద ఈ సమస్యను చెప్పగా, కొంతమంది నటించమని అంటుంటే, మరికొంత మంది మాత్రం వద్దని చెబుతున్నారు. యాడ్ లో నటించకపోయినప్పటీకీ, తను కనిపించే ఆ 10 సెకండ్స్ తో, తన మార్కెట్ పడిపోవచ్చని కొంత మంది అంటున్నారట. దీంతో ఫైనల్ తను యాడ్ నుండి తప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు. కాజల్ ఎందుకు ఇంతలా ఆలోచిస్తుందంటే, ఆ యాడ్ చేసినందుకు కాజల్ కి ఆఫర్ చేసన అమౌంట్ దాదాపు 2 కోట్ల రూపాయలు అంట. అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ లో రెండు సంవత్సరాల వరకూ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని ఉండటంతో తెగ భయపడిపోతుందోని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: