అక్కినేని ఫ్యామిలీ నుండి వస్తున్న మరో యంగ్ హీరో అక్కినేని అఖిల్. అఖిల్ డెబ్యూ మూవీకి సంబంధించిన కసరత్తులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గానే అఫిషియల్ గా పూజా కార్యక్రమాలను జరుపుకొని, ప్రి ప్రొడక్షన్ నుండి, సెట్స్ మీదకు వెళుతున్న ఈ మూవీ నుండి, రోజురోజుకి సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా అఖిల్ ఎంట్రి ఇస్తున్న డెబ్యూలో నితిన్ స్క్రీన్ స్కేస్ ని పంచుకోవడం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త క్రేజ్ ని క్రియేట్ చేస్తుంది. అంతే కాకుండా అఖిల్ మూవీకి స్టార్ కమర్షియల్ డైరెక్టర్ వినాయక్ పనిచేయడం అనేది, ఈ ప్రాజెక్ట్ పై మరింత అంచనాలను పెంచేస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ డ్యూబ్యూగా వచ్చిన అల్లుడు శీను మూవీని డైరెక్టర్ వినాయక్ చాలా తెలివిగా హ్యాండిల్ చేశాడు. అందుకే ఆ మూవీ బాక్సాపీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇక అఖిల్ విషయానికి వస్తే వినాయక్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే రీసెంట్ గా అఖిల్ డెబ్యూ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో అఖిల్ తో పాటు కొన్ని సెకండ్స్ పవన్ కళ్యాణ్ కనిపిస్తాడంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. ఒక నిముషం కంటే తక్కవ ఉన్న నిడివిలో పవన్ కళ్యాణ్, అఖిల్, నితిన్ ఒకే ప్రేమ్ కనిపించడం అనేది జరుగతుంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. నాగార్జునకి పవన్ కళ్యాణ్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే అఖిల్ డెబ్యూ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న నితిన్ కి పవన్ కళ్యాణ్ అత్యంత ఆప్తుడు. ఈ రెండు విషయాల కారణంగా నితిన్ ఒత్తడి మేరకు పవన్ కళ్యాణ్, అఖిల్ డెబ్యూ మూవీలో కనిపించేందుకు ఒప్పుకున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల టాక్స్. పవన్ కళ్యాణ్, అఖిల్ డెబ్యూలో కనిపిస్తున్నాడనే విషయం తెలియడంతో, ఈ మూవీపై మరింత ఎక్స్ ఫెక్టేషన్స్ పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: