రాబోతున్న సంక్రాంతికి రికార్డులు క్రియాట్ చేసి సంచలనాలు సృస్తిద్దామనుకున్న జూనియర్ ఆశలు పగటి కలలుగానే మిగిలిపోయాయి. ఘోర పరాజయంతో తనకు తీవ్ర నిరాశను గతంలో మిగిల్చిన ‘రామయ్య వస్తావయ్య’ ఇప్పటికీ యూట్యూబ్ లో క్రియేట్ చేస్తున్న రికార్డులు అర్ధం కాని ప్రశ్నలుగా జూనియర్ కు మారిపోయాయి అనే మాటలు వినిపిస్తున్నాయి.  థియేటర్లలో సూపర్‌ ఫ్లాప్‌ అయిన ఇదే సినిమా ఇప్పుడు యూట్యూబ్‌లో మాత్రం బ్లాక్‌ బస్టర్‌ గా మారిపోయింది. ఆదిత్య మూవీస్‌ వెబ్ ఛానల్‌లో ఉన్న ఈచిత్రానికి ఇప్పటికి నలభై లక్షలకి పైగా వ్యూస్‌ వచ్చాయి అని టాక్. దీనితో ఆదిత్య మూవీస్‌ ఇప్పటికీ నెల నెలా క్యాష్‌ డ్రా చేస్తోంది అనే వార్తలు వినపడుతున్నాయి.  విచిత్రం ఏమిటంటే 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాన్ని థియేటర్లలో చూడని వారు యూట్యూబ్‌లో మాత్రం మిస్‌ కాకుండా చూసేస్తున్నారట. ఒక్క ఆదిత్య ఛానల్‌లోనే నలభై లక్షలమంది ఈ సినిమాను చూస్తే. మిగిలిన ఛానల్స్‌ అన్నీ కలిపితే ఆ సంఖ్య చాలా ఎక్కువే ఉంటుందనె లెక్కలు జూనియర్ వేసుకున్తున్నాడని టాక్.  ఇదే రేంజ్‌లో ఈ చిత్రాన్ని ధియేటర్లలో చూసివుంటే జూనియర్ ‘రామయ్య వస్తావయ్య’ సూపర్ హిట్ అయి ఉండేదని జూనియర్ తన సన్నిహితుల దగ్గర కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గత వినాయక చవితికి విడుదల అయి ఫ్లాప్ అయిన ‘రభస’ ఈ మధ్య బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు తెచ్చుకిన్న రేటింగ్స్ చూస్తే జూనియర్ ను ఏవిదoగా దురదృష్టం వెంటాడుతోందో అర్ధం అవుతుంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: