ఈ మధ్యనే తన తల్లి తండ్రులతో తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న బన్నీ ముద్దుల కొడుకు అయాన్ ఈరోజు సర్వ మత సారాంశాన్ని అందరికీ తెలియచేస్తూ అందమైన శాంటాక్లాజ్ డ్రస్ తో తన చిరునవ్వులను పిల్లలందరికీ క్రిస్మస్ బహుమతులుగా మార్చి హడావిడి చేస్తూ ఇలా కెమెరాకు పోజు ఇచ్చాడు. ఆ మధ్య జరిగిన జవహర్ లాల్ నెహ్రు పుట్టిన రోజు సందర్భంగా బుల్లి చాచా నెహ్రుగా పోజు ఇచ్చిన విషయం మరిచి పోకముందే ఇలా ఇప్పుడు శాంటాక్లాజ్ గా మారిపోయాడు. వరస పెట్టి కెమెరాలకు రకరకాల పోజులు ఇస్తున్న అయాన్ ను చూస్తుంటే త్వరలోనే బాలనటుడిగా మారి అల్లువారి నాల్గవ తరo వారసత్వాన్ని కొనసాగించేలా కనిపిస్తున్నాడు.  ఇక డాన్సులలో కూడా తన తండ్రి అల్లుఅర్జున్ వారసత్వాన్ని అయాన్ కొనసాగించగలిగితే బన్నీకి భవిష్యత్ లో అయాన్ నుంచి పోటీ రావడం ఖాయం. ఈరోజు వెబ్ మీడియాకు అయాన్ శాంటాక్లాజ్ స్టిల్ హాట్ టాపిక్ గా మారి అందర్నీ ఆకర్షిస్తోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: