రజినీకాంత్ అల్లుడిగా కాకుండా ఒక హీరోగా కోలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్న ధనుష్ పై హీరో రామ్ ఆశక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఈ సంవత్సరం కోలీవుడ్ లో విడుదలైన సినిమాలలో ధనుష్ నటించిన ‘వేలై ఇల్లా పట్టదారి’ ఒక ట్రెండ్ సెటర్ ఈసినిమా 50 కోట్లు వసూలు చేసి కోలీవుడ్ లో సంచలన విజయం సాధించింది.  ఈ సినిమాను హీరో రామ్ పెద్దనాన్న స్రవంతి రవికిషోర్ ‘రఘవరన్ బి. టెక్’ గా డబ్ చేసి కొత్త సంవత్సరం మొదటి రోజు విడుదల చేస్తున్నారు. కొత్త సంవత్సరంలో టాలీవుడ్ సినిమాల హడావిడి ఈ సినిమాతోనే ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్న రామ్ మాట్లాడుతూ తన పెదనాన్న తనని హీరోగా చేసి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేద్దామని ప్రయత్నించారని అంటూ, అయితే ఈ సినిమాను తమిళంలో తాను చూసాక ఈ సినిమాను ఎట్టి పరిస్తుతులలోను టచ్ చేయకూడదని అనుకున్నానని దీనికి కారణం ఈ సినిమాలో ధనుష్ అద్భుతంగా నటించాడు అంటూ తాను ఆ స్థాయిలో నటించి మెప్పించ లేను అని ఆశక్తికర వ్యాఖ్యలు చేసాడు రామ్. డిఫరెంట్ సినిమాగా ఇప్పటికే కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా సంక్రాంతి బడా సినిమాలకు ముందు పైలెట్ గా సందడి చేస్తూ రాబోతున్న ధనుష్ సాహసం ఇక్కడ కూడా సంచలనాలు క్రియేట్ చేస్తుందేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: