అనుష్క శర్మ ఆస్ట్రేలియాకు పయనం కానున్నారు. నూతన సంవత్సరాల వేడుకలను ప్రియుడు విరాట్ కోహ్లితో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు ఆమె ఆసీస్ కు బయల్దేరి వెళ్లనుంది. ప్రస్తుతం పీకే విజయంతో మునిగితేలుతున్నఅనుష్క.. ఆసీస్ టూర్ లో బిజీగా ఉన్న కోహ్లి వద్దే కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవాలని నిశ్చయించుకుంది. దీనిపై ఆ యువ జంట ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్ల తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం అనుష్క శర్మ వ్యవహారశైలిపై విరాట్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అనుష్క శర్మ ఓ మేగ్ జైన్ కు ఇచ్చిన హాట్ ఫోటో షూట్ పై విరాట్ ప్రశ్నించడంతో వారి మధ్య కాస్త ఎడబాటు వచ్చింది. అటు తరువాత విరాట్ శాంతించడంతో అనుష్క ఆసీస్ కు వెళ్లేందుకు సిద్ధమయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: