నిన్న విడుదలైన నితిన్ ‘చిన్న దానా నీకోసం’ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా కనిపించకపోయినా నితిన్ మితిమీరి చేసిన పవన్ నామస్మరణ ఈ సినిమాను ఇరు రాష్ట్రాలలోను పెద్దగా రక్షించలేక పోయింది అనే వార్తలు వస్తున్నాయి. నితిన్ తన గత సినిమాలతో పోల్చుకుంటే పవన్‌ను ఈసారి ఎక్కువగానే వాడుకున్నాడు. నితిన్ సినిమాలో సూటిగా కాకపోయినా ఇన్‌డైరెక్టుగా కథలో పవన్ కళ్యాణ్‌ కీలక పాత్ర పోషించాడు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాలో ఓ సన్నివేశంలో నితిన్ ఆర్ట్ వేస్తుంటే వెనుక నుంచి చూసిన హీరోయిన్‌ హీరో తన బొమ్మ బొమ్మ గీస్తున్నాడేమో అని అనుకుంటుంది. కానీ హీరో గీసింది తనమనసులో ఉన్న పవన్ బొమ్మ. అది చూసిన హీరోయిన్ ఇంత బాగా గీశావ్ నీకు ఆర్ట్ ఇంత బాగా వచ్చా అని హీరోయిన్ అడిగితే "మనసులో పిచ్చి ప్రేమ ఉంటే బొమ్మ దానంతట అదే వస్తుంది" అని చెప్పడం ద్వారా పవన్ అంటే తనకెంత ఇష్టమో హీరో పాత్రలో ఉన్న నితిన్ చెప్పాడు.  ఇక సెకండాఫ్‌లో వచ్చే ఓ కౌబాయ్ సాంగ్‌లో నితిన్‌కు ఉరి వేసి ఉంటుంది. అతన్ని కాల్చబోతుండగా పవన్ ఎంట్రీ ఇస్తాడు. బద్రి సినిమాలోని ‘ఏయ్ చికితా’ పాటలోని దృశ్యాల్ని మిక్స్ చేసి నితిన్‌ని కాల్చబోయే రౌడీల్ని పవన్ షూట్ చేసినట్లు చూపించారు. అయితే ఈ రెండు సన్నివేసాలు వచ్చినప్పుడు థియేటర్ లోని ప్రేక్షకులు చప్పట్లతో ఈలలతో హోరెత్తిoచినా చివరకు సినిమా ముగిసి బయటకు వచ్చే సరికి ఈ సినిమా పై పెదవి విరిచి చెప్పుకోతగ్గ సినిమా కాదు అని కామెంట్స్ ఇస్తూ ఉండటంతో ఈసారి నితిన్ కు పవన్ సెంటిమెంట్ కలిసి రాలేదేమో అనిపిస్తోంది.  సరైన కథ లేకపోతే పవర్ స్టార్ కూడా ఏమీ చేయలేదు అనే విషయం నిన్నటి నితిన్ సినిమా మరొకసారి రుజువు చేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: