మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ డెబ్యూ మూవీనే ‘ముకుంద’. వరుణ్ తేజ్ ని చూసిన వారందరికీ, ఫ్యాన్స్ కి మెగా ఫ్యామిలీ నుండి మరో మంచి హీరో వస్తున్నాడనే భావన కలిగింది. అయితే తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ సినీ ప్రేక్షకుల వద్ద నుండి డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో మూవీకి సంబంధించిన కలెక్షన్స్ కూడ డ్రాప్ అయ్యే అవకాశం ఉందని అందరూ గెస్ చేశారు. అయితే ట్రేడ్ రిపోర్ట్స్ వద్ద నుండి మొదటి రోజు రిపోర్ట్స్ బయకు వచ్చాయి. దీంతో ఈ బుధవారం విడుదలైన ముకుంద మూవీకి సంబంధించిన బాక్సాపీస్ డిటైల్స్ ని ఓ సారి చూద్దాం. ముకుంద మూవీ భారీ అంచనాల నడుమ విడుదలైంది. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న క్రేజీ హీరో కావడంతో, వరుణ్ తేజ్ మూవీ ఓపెనింగ్స్ పై ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. మొదటి రోజు ఈ మూవీ 3.45 కోట్ల రూపాయలతో ఆంధ్ర అండ్ తెలంగాణ ప్రాంతంలో డీసెంట్ ఓపెనింగ్స్ ని అందుకుంది. అలాగే రెండో రోజు కూడ ఈ మూవీ అదే కలెక్షన్స్ ని కొనసాగింది. ఇప్పటి వరకూ ముకుంద మూవీ రెండు కలెక్షన్స్ చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకొని దాదాపు 7.50 కోట్ల రూపాయలతో బాక్సాపీస్ వద్ద నిలకడగా ఉంది. ఈ సినిమా వీకెండ్స్ లో ఎక్కువ మొత్తంలో కలెక్షన్స్ ని కొల్లగొడుతుందని బాక్సాపీస్ వద్ద రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే రెండు రోజుల ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలుపుకుంటే, దాదాపు 9 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కొల్లగొట్టిందని బాక్సాపీస్ రిపోర్ట్ చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: