మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలలో రామ్ చరణ్ ది డిఫ్రెంట్ స్టైల్. తండ్రి చిరంజీవిది ఎంత సపోర్ట్ ఉన్నప్పటికీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలదొక్కోవాలంటే కచ్ఛితంగా టాలెంటే ప్రధాన ఆయుధం. అందుకే మెగాస్టార్ చిరంజీవి అనే ప్లాట్ ఫాం తో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రిన ఇచ్చిన రామ్ చరణ్, ఆ తరువాత మాత్రం తనదైన శైలితో నటిస్తూ, సినీ ప్రేక్షకులతో పాటు మెగా అభిమానులకు మరింత చేరువ అయ్యాడు. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా రామ్ చరణ్ నటిస్తున్న మూవీలు అన్నీ బాక్సాపీస్ వద్ద డీసెంట్ హిట్ ను సాధిస్తున్నాయి. అయితే రామ్ చరణ్ కి కేవలం ఓవర్సీస్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో తప్పితే మరెక్కడా అంతగా డిమాండ్ లేదు. దీంతో రామ్ చరణ్ తన మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందులోనే భాగంగా మల్లువుడ్ లో తన సత్తా చాటాలనుకుంటున్నాడు. ఇప్పటికే మలయాళంలో అల్లుఅర్జున్ కి సూపర్ డిమాండ్ ఉంది. ఇప్పుడు అల్లుఅర్జున్ సూత్రాన్నే ఫాలో అవుతూ, తను కూడ మలయాళంలో స్టార్ డం ని సంపాధించుకోవాలని చరణ్ చూస్తున్నాడు. రీసెంట్ గా రామ్ చరణ్ నటించిన గోవిందుకు అందరివాడేలే మూవీ, మలయాళంలో ఏకలవ్య పేరుతో రిలీజ్ అవుతుంది. మలయాళంలో రిలీజ్ అవుతున్న ఏకలవ్య మూవీకి అల్లుఅర్జున్ ప్రమోషన్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మలయాళంలో గోవిందుడు అందరివాడేలే మూవీని రిలీజ్ చేస్తే, ఆ మూవీకి, అలాగే రామ్ చరణ్ కి, అల్లు అర్జున్ ప్రమోషన్ చేస్తానని చరణ్ కి మాట ఇచ్చాడంట. వెంటనే అల్లుఅర్జున్ ని నమ్ముకొని చరణ్ మలయాళంలో మార్కెట్ ని పెంచుకొనే ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగు హీరోలకి ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలో మార్కెట్ పెరిగితే సంతోష పడేది ముఖ్యంగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని నిర్మాతలే. మొత్తంగా రామ్ చరణ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పవచ్చని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: