ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని పరిచయాలు ఎప్పుడు, ఏ సమయంలో పరిచయం అవుతాయో.. తెలియదు కాని, దాదాపు ఆ మత్తు మాత్రం కొంత కాలంపాటు అలా ఉండిపోతుంది. ఆ విధంగానే బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని అనుష్క శర్మ పరిస్థితి తయారయిందని అంటున్నారు. ఎందుకంటే అనుష్క శర్మకి క్రికెటర్ విరాట్ కోహ్లితో ఎప్పుడైతే పరిచయం మొదలైందో, అప్పటి నుండి వీరిద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేకపోతున్నారు. మీడియా, ప్రెస్, వెబ్ ఇలా అన్నింట్లో ఎన్ని రకాలుగా వీరిద్దరి గురించి న్యూస్ లు వస్తున్నప్పటికీ, వీరు మాత్రం ఇవేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా అనుష్క శర్మ తీసుకున్న నిర్ణయం మరోసారి ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఆస్ట్రేలియాకు రెడీ అవుతుంది. కారణం మాత్రం చాలా సింపుల్. తన ప్రియుడు విరాట్ కోహ్లి ఆసీస్ లో ఉన్నాడు కాబట్టి తను కూడ అక్కడే ఉంటానని అంటుంది. నూతన సంవత్సరాల వేడుకలను ప్రియుడు విరాట్ కోహ్లితో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు, అనుష్కశర్మ ఈ ప్లానింగ్ వేసింది. ఈ నూతన సంవత్సర వేడుకలు పేరుతో వీరిద్దరూ దాదాపు మూడు రోజుల పాటు ఆసీస్ లో ప్రవేట్ గా ఎంజాయ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని బిటౌన్ మీడియా ఆనుష్క శర్మని ప్రశ్నిస్తే, "ఇదంతా కామన్ కదా, పదే పదే అడిగిన ప్రశ్నను అడుగుతుంటే కొత్త సమాధానం ఎక్కడ నుండి తీసుకురావాలి. నన్ను వదిలేయండి. ఆ తరువాత మీ ఇష్టం" అంటూ అక్కడి నుండి వెళ్ళి పోయిందట. కొన్ని రోజుల క్రితం అనుష్క శర్మ వ్యవహారశైలిపై విరాట్ అసహనం వ్యక్తం చేసినప్పటికీ, అది మీడియాను దృష్టి పెట్టుకొని మాత్రమే తను ఆ విధంగా చేసాడని మీడియా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: