పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ గోపాల గోపాల. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరగుతుంది. ఒక సాంగ్ మినహా సినిమా పూర్త‌యింద‌ని స‌మాచారం. ఈ రోజు నుండి మిగిలిన ఒక సాంగ్ ని హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. విక్ట‌రీ వెంక‌టేష్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌ల‌సి న‌టిస్తోన్న మ‌ల్టీస్టార‌ర్ 'గోపాల గోపాల' పై ఫిల్మ్ ఇండస్ట్రీలో బారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ మూవీకి సంబంధించిన ప్రతి విషయాన్ని అటు అభిమానులతో పాటు, ఇండస్ట్రీ వర్గాలు కూడ ఆసక్తిని కనబరుస్తున్నాయి. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వస్తున్న భారీ చిత్రం కావడంతో ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ ని ఇప్పుడే షూట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. చిత్ర షూటింగ్ లో భాగంగా వెంకటేష్, పవన్ కళ్యాణ్ లపై కొన్ని కామెడీ స్కిట్స్ ని చిత్ర యూనిట్ రెడీ చేసింది. పవన్ కళ్యాణ్ కి ఆ కామెడీ స్కిట్స్ ని వివరించినట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఆ తరహా ప్రమోషన్స్ కి నో చెప్సేశాడు. డీసెంట్ గా వెంకటేష్, పవన్ కళ్యాణ్ మధ్య సాగే ఇంటర్వూ అయితే చేస్తానంటూ, పవన్ చాలా క్లియర్ గా ఆన్సర్ ఇచ్చాడంట. దీంతో చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకున్న కామెడీ స్కిట్స్ ప్లాన్ అనేది ఇప్పుడు వర్కవుట్ కాని విషయంగా మారింది. ఈ విషయంలో వెంకటేష్ ని ఇన్వాల్స్ చేసి, పవన్ కళ్యాణ్ ని ఒప్పించాలని చూసినప్పటికీ, వెంకటేష్ కూడ ఈ విషయంలో ఎక్కువుగా ఇన్వాల్స్ కాలేదంట. ఇప్పుడు వీరిద్దరి మీద మాత్రం ఓ స్పెషల్ ఇంటర్వూని త్వరలో చిత్ర యూనిట్ షూట్ చేయనుంది. గోపాల గోపాల సినిమాని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌. అయితే గోపాల గోపాల జ‌న‌వ‌రి 9న విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని కూడా వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: