టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలకు వరంగా మారిన నాని, ప్రస్తుతం మాత్రం తను నటించే మూవీలు ఏవి అంతగా రిలీజ్ కి నోచుకోవడం లేదు. అయితే నిర్మాతల విషయంలో నాని సెలక్షన్స్ తప్పు అంటూ కొందరూ తనకి చెబుతున్నా, నాని మాత్రం మూవీలని రిలీజ్ చేసుకోలేని నిర్మాలకి కూడ డేట్స్ ఇచ్చి, ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాడు. దీనికి కారణంగా నానికి అప్ కమింగ్ మూవీ ఆఫర్స్ రావాలంటే, తను నటించిన ప్రీవియస్ మూవీలు రిలీజ్ కాలేదుగా? అని మిగతా నిర్మాతలు ఆలోచిస్తున్నారు. దీంతో గత రెండు సంవత్సరాలు నాని ఇబ్బందులు పడుతూనే వస్తున్నాడు. ఇదిలా ఉంటే నాని ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తున్నాడు. నాని ఆలోచనలు ఫిల్మ్ ఇండస్ట్రీలోని పెద్దలకి సైతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నాని ఓ ప్రొడక్షన్ హౌస్ ని భారీగా ప్లాన్ చేస్తున్నాడు. తను ఏర్పాటు చేస్తున్న ప్రొడ్రక్షన్ హౌస్ నుండి చిన్న తరమా మూవీలను ఎక్కువ సంఖ్యలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేయాలనకుంటున్నాడు. ఇందులో నాని బ్యాచ్ లోని మిగతా హీరోలు కూడ ఇన్వాల్స్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే నాని తీయబోతున్న చిన్న మూవీలలో ఎక్కువ మూవీలు కోలీవుడ్ లో రిలీజ్ అవుతాయంట. ఎందుకంటే కోలీవుడ్ లో ఎక్స్ పరిమెంట్ తో తీసిన చిన్న మూవీలు బాక్సాపీస్ వద్ద లాభాలను తెచ్చిపెట్టాయి. అందుకే కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు నాని ఆలోచనలు వెళుతున్నాయి. ఇదిలా ఉంటే తెలుగులో రెండు మూవీలకి నాని కమిట్మెంట్స్ ఇచ్చినప్పటికీ, అవి సెట్స్ మీదకు వెళ్ళటానికి ఇంకొంత సమయం పడుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: