బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ లెక్కలేనన్ని లివింగ్ రిలేషన్స్ జరిగి ఉంటాయి. ఎందుకంటే బిటౌన్ లో ఆపర్స్ చేజిక్కించుకోవాలంటే కచ్ఛితంగా కమిట్మెంట్ తో కూడిన వర్క్ ఉండాలి. ఆ కమిట్మెంట్ అనేది చివిరికి లివింగ్ రిలేషన్ వరకూ వెళుతుంది. గతంలో కరినా కపూర్, షాహిద్ కపూర్ ఇద్దరూ 4 సంవత్సరాల లివింగ్ రిలేషన్ ని మెయింటెన్ చేశారని మీడియా పదే పదే చెప్పినా, అందకు వీరిద్దరి నుండి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఆ తరువాత కరిష్మా కపూర్ పెళ్ళి, సైఫ్ అలీ ఖాన్ తో కుదిరిందో, దానికి రెండు సంవత్సరాల ముందు నుండి తను షాహిద్ కపూర్ ఉన్న రిలేషన్ కి గుడ్ భై చెప్పడం జరిగింది. చివిరిసారిగా షాహిద్ కపూర్, కరినా కపూర్ కలిసి నటించిన మూవీ జబ్ వుయ్ మెట్, బాక్సాపీస్ వద్ద బంపర్ హిట్ అయింది. “ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి సీక్వెల్ వస్తే, అందులో నటించటానికి మీరు సిద్ధంగా ఉన్నారా?” అంటూ కరినా కపూర్ ని మీడియా అడిగింది. అందుకు కరినా కపూర్, “నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తే, నటించటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని” సమాధానం ఇచ్చింది. ఇదే టాపిక్ ని షాహిద్ కపూర్ వద్ద మీడియ ప్రశ్నించింది. అందుకు షాహిద్ కపూర్ చెప్పిన సమాధానం చాలా చిలిపిగా ఉందంటూ మీడియా కితాబు ఇచ్చింది. షాహిద్ చెప్పిన సమాధానం ఏమిటంటే “కరీనాకపూర్ తో నటించడం ఎటువంటి ఇబ్బందిలేదు కాని, సీక్వెల్ కారణంగా మళ్ళీ మేమిద్దం ఒకటి కాబోతున్నాం..” అంటూ కామెంట్ చేశాడు. ఈ న్యూస్ కరీనాకపూర్ వద్దకు వెళ్లినా, తను ఎటువంటి కామెంట్ చేయకుండా కామ్ గా ఉండిపోయింది. మొత్తంగా పెళ్ళైన కరీనాకపూర్ తో తిరిగి రిలేషన్ ని మెయింటెన్ చేయటానికి షాహిద్ సిద్ధంగా ఉన్నాడని మీడియా తేల్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: