రవిబాబు తీసిన ‘అవును’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన పూర్ణ ఇప్పుడు ఏకంగా మహేష్ బాబును బుట్టలో పెట్టింది అనే వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఈనెల 28 నుంచి ప్రారంభం అవుతుంది అనే వార్తలు వస్తున్నాయి. మహెహ్ బాబు పక్కన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగతిబాబు, రాజేంద్రప్రసాద్, బ్రహ్మనందం లాంటి టాప్ యాక్టర్స్ అంతా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈసినిమాలో క్లాసికల్ డాన్సర్ పాత్ర ఉంటుందని టాక్. అంతేకాకుండా పల్లెటూరి వాతావరణ నేపధ్యంలో క్లాసికల్ డాన్స్ తో చిత్రీకరించే ఒక పాత్ర కోసం ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ ఆలోచిస్తున్న నేపధ్యంలో శివకు హీరోయిన్ పూర్ణ పేరును కొంత మంది సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి.  దీనికి కారణం పూర్ణ కథక్ డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకున్న కళాకారిణి. ఈ నేపధ్యంలో మహేష్, కొరటాల సినిమాకు పూర్ణ ఎంపిక అయింది అనే వార్తల హడావిడి వినిపిస్తోంది. ఈ సినిమాలో పూర్ణ కనిపించేది కొద్ది నిముషాలే అయినా ఈ సినిమాలోని మహేష్ పాత్రకు సంబంధించి ట్విస్ట్ ఇవ్వబోయే ముఖ్య పాత్ర ని అంటున్నారు. ఈ వార్తలే నిజం అయితే మహెహ్ బాబును బుట్టలో పెట్టిన హీరొయిన్ గా పూర్ణ జాక్ పాట్ కొట్టేసింది అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: