మరి కొద్ది రోజులలో ముగిసి పోతున్న 2014 మంచు వారి అబ్బాయి విష్ణుకు కాని, అల్లరోడు నరేష్ కు కాని ఏవిధంగాను కలిసి రాలేదు. తమ సినిమాల ద్వారా హిట్స్ కొడదామని ఎన్నో ప్రయత్నాలు చేసిన వీరిద్దరికీ ఘోరమైన అపజయాలే మిగిలాయి. దీనితో ఈ సంవత్సరపు ఫ్లాప్ హీరోలుగా మిగిలిపోయిన వీరిద్దరూ కొత్త సంవత్సరం ప్రారంభంలో జత కట్టి ఒక వినూత్న ప్రయోగం చేయబోతున్నారు. వీరిద్దరూ ఒక మల్టీ స్టారర్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనే వార్తలు వస్తున్నాయి. టోటల్ కామెడీ మూవీగా తెరకు ఎక్కబోతున్న ఈ సినిమాను ‘అత్తారింటికి దారేది’ లాంటి సూపర్ హిట్ తీసిన బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడని టాక్.  ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి అయిన ఈ సినిమా వచ్చే సంవత్సరం జనవరిలో ప్రారంభం అవుతుందని అంటున్నారు. ఒక కొత్త దర్శకుడు దర్శకత్వం వహించబోయే ఈ సినిమా ఒక డిఫరెంట్ కథ అనే మాటలు వినిపిస్తున్నాయి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో ప్రధాన విలన్ గా పాత్రను పోషిస్తున్న జగపతి బాబు కూడా తన స్థాయిలో కామెడీ పండిస్తాడని టాక్.  ఈ విధంగా విష్ణు అల్లరి నరేష్ జగపతి బాబు కలిసి చేయబోతున్న ఈ కామెడీ వెరైటీ సినిమా అయినా అటు విష్ణుకు ఇటు అల్లరోడికి కలిసి వస్తుందేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: