టాలీవుడ్ కలెక్షన్స్ చరిత్రను తిరగ రాస్తుంది అని రోజురోజుకు అంచనాలు పెంచుకుంటున్న రాజమౌళి ‘బాహుబలి’ తమ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసే ఉద్దేశ్యంతో ఒక కొత్త ప్లాన్ ను ఆలోచించినట్లు వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ‘బాహుబలి’ షూటింగ్ లో జరిగిన చిత్ర విచిత్ర విశేషాలను క్రోడీకరించి ఒక పుస్తక రూపంలో త్వరలో రాజమౌళి విడుదల చేయబోతున్నట్లు టాక్. ఇప్పటికే ఈ సినిమా మేకింగ్ పై వీడియోలు విడుదల చేసి ఈ సినిమా క్రేజ్ ను పెంచిన రాజమౌళి ఈ పుస్తకాన్ని చాల డిఫరెంట్ గా తయారు చేయిస్తున్నట్లు టాక్. ఈ పుస్తకంలో ఈ చిత్రం మేకింగ్ విషయాలతో పాటు ఈ సినిమా కోసం రాజమౌళి వేయించిన స్కెచ్ లతో పాటు షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన విశేషాలు కూడా ఉంటాయి.  ఇది ఇలా ఉండగా రాజమౌళి రాజస్థాన్ నుండి తెప్పించిన 1000 గుర్రాలతో వచ్చే సోమవారం నుండి ఒక ప్రత్యేక యుద్ద సన్నివేశాన్ని రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వెబ్ మీడియా, ఎలట్రానిక్ మీడియా, షేల్ ఫోన్స్ హడావిడితో పుస్తకాలను చదవడం మానేసిన నేటి యువతరానికి తన ‘బాహుబలి’ పుస్తకం ద్వారా పుస్తకాల పట్ల కూడా యూత్ కు ఆసక్తి కలిగించే మంచి పని రాజమౌళి చేస్తున్నాడు అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: