తెలుగు సినిమాలలో తాగుబోతు పాత్రలకు చిరునామాగా మారిపోయిన తాగుబోతు రమేష్ హవా ఇప్పుడు కన్నడ సినిమా రంగం శాండీల్ వుడ్ తాకినట్లుగా వార్తలు వస్తున్నాయి. తాగుబోతు రమేష్ హీరోగా ఒక సినిమా నిన్న బెంగుళూరులో ప్రారంభం అయింది. ఈ సినిమాకు కన్నడ దర్శకుడు త్రిశూల్ దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ తెలుగు భాషలలో ఏక కాలంలో ఈ సినిమాను నిర్మించబోతున్నారని తెలుస్తోంది.  ఈ సినిమాలో రమేష్ పక్కన మేఘనా పటేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటి వరకు కేవలం తాగుబోతు పాత్రలను చేసి మెప్పించిన రమేష్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ పాత్రను చేయబోతున్నాడని తెలుస్తోంది. అన్నీ కలిసి వచ్చి ఈ సినిమా విజయవంతం అయితే కమెడియన్ స్థాయి నుండి రమేష్ హీరోగా నిలదొక్కుకోవడం ఖాయం. తాగుబోతు పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పరుచు కోవడమే కాకుండా తన పారితోషికాన్ని కూడా భారీ స్థాయిలో పెంచిన రమేష్ ప్రస్తుతం తీసుకున్న ఈ నిర్ణయం బాగా కలిసి వచ్చి ఇతడి కెరియర్ ను ఒక మలుపు తిప్పుతుందా? లేదంటే సునీల్ తీసుకున్న తప్పు నిర్ణయంలా రమేష్ కెరియర్ కు గ్రహణoలా మారుతుందా అనే విషయం పై వచ్చే సంవత్సరంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: