టాలీవుడ్ ఎంపరర్ పవన్ కళ్యాణ్ కేవలం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ కు కూడా పవన్ గాలి పాకిపోనట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం కొద్దిరోజుల క్రితం విడుదలైన ‘గోపాల గోపాల’ మోషన్ పోస్టర్. ఈ పోస్టర్ ప్రతి ఒక్కరినీ ఆకర్షించడమే కాకుండా యూ ట్యూబ్ లో ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది అనే వార్తలు వస్తున్నాయి. ఈ మోషన్ పోస్టర్ కు ఇప్పటి వరకు పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి అని టాక్. గతంలో ఏ ప్రముఖ బాలీవుడ్ సినిమా మోషన్ పోస్టర్ కు ఇంతగా వ్యూస్ రాలేదు అనే వార్తలు వినపడుతున్నాయి. ఈ రికార్డులను చూసి టాలీవుడ్ నిర్మాతలే కాదు బాలీవుడ్ దిగ్గజాలు కూడా ‘గోపాల గోపాల’ ట్రెండ్ సెటర్ కాబోతోంది అని కితాబిస్తున్నారు. ఈ వార్తలు విన్న పవన్ అభిమానులే కాదు టాలీవుడ్ ప్రాముఖ దర్శక నిర్మాతలు కూడా విడుదల కాకుండానే తెలుగు సినిమాను బాలీవుడ్ ను ఆకర్షించే స్థాయికి పవన్ క్రేజ్ తీసుకు వెళ్ళినందుకు ఆనంద పడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. పవన్ నిజంగా ఓ ట్రెండ్ సెట్టర్ గా అయ్యాడు కాబట్టే నెల రోజుల్లోపు పది లక్షల వ్యూస్ ను పొందిన రికార్డును క్రియేట్ చేసాడని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.  ఒక్క మోషన్ పోస్టర్ లోనే ఇన్ని రికార్డులు క్రియేట్ చేసిన ‘గోపాల గోపాల’ విడుదలైన తరువాత ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి..   

మరింత సమాచారం తెలుసుకోండి: