ఒక సంవత్సరంలో రెండు సినిమాలను విడుదల చేసినా ఫలితం లేకపోవడంతో ప్రస్తుతం రజినీ కెరియర్ కొంత అయోమయ స్థితిలో ఉంది అనే వార్తలు వినపడుతున్నాయి. గతంలో రజినీకాంత్ నటించిన ‘రోబో’ సినిమా రికార్డులను ఈ సంవత్సరం విడుదలైన విజయ్ ‘కత్తి’ అధిక మించడంతో రజినీకాంత్ అభిమానులను మరింత నిరాశ పరుస్తోంది.  ఈ నేపధ్యంలో తన అభిమానులకు మంచి జోష్ నిచ్చే సినిమాను వచ్చే సంవత్సరం అయినా ప్రారంభించి పూర్తి చేయాలి అన్న దృడసంకల్పంతో రజినీకాంత్ ఉన్నాడని టాక్. అయితే రజినీతో సినిమా తీయడానికి చాలామంది కోలీవుడ్ దర్శకులు మోజు పడుతున్నా రజినీ దృష్టి మాత్రం రాజమౌళి పైనే ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ నేపధ్యంలో కొద్దిరోజులక్రితం ఒక ప్రముఖ కోలీవుడ్ నిర్మాత రాజమౌళిని వ్యక్తి గతంగా కలిసి ‘బాహుబలి’ మొదటి భాగం విడుదల అయిన తరువాత అయినా రజినీకాంత్ తో సినిమా చేస్తాడా అనే విషయం పై ఆరా తీస్తే రాజమౌళి ‘బాహుబలి 2’ విడుదల తరువాత 2016లో మాత్రమే తాను కొత్త సినిమాల గురించి ఆలోచిస్తాను అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో రజినీకాంత్ కు మళ్ళీ కోలీవుడ్ దర్శకులలోనే ఎవర్నో ఒకరిని ఎంచుకుని కొత్త సంవత్సరంలో ఒక కొత్త సినిమాను చేస్తాడా లేదంటే తాను కోరుకున్న రాజమౌళి కోసం 2016 వరకు వేచి ఉంటాడా అనే విషయం ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..   

మరింత సమాచారం తెలుసుకోండి: