యంగ్ హీరో నిఖిల్ తన ‘కార్తికేయ’ సినిమా ఊహించని ఘన విజయం సాధించిన తరువాత మంచి జోష్ మీద ఉండటమే కాకుండా తన పారితోషికాన్ని కూడా కోటి రూపాయల వైపు పరుగులు తీస్తున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు మరింత ట్విస్ట్ ను ఇస్తూ నిఖిల్ పెట్టిన ఒక ట్విట్ అందర్నీ తెగ ఆలోచింప చేస్తోంది.  ఈ సంవత్సరం చివరి రోజున మీతో ఒక మంచి శుభ వార్తను షేర్ చేసుకోబోతున్నాను అంటూ ట్విట్ చేసాడు. దీనితో నిఖిల్ చెప్పబోతున్న శుభవార్త అతడి పెళ్ళి గురించి అంటూ అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి కారణం నిఖిల్ తల్లి తండ్రులు ఈ యంగ్ హీరో కోసం ఒక మంచి అమ్మాయిని వెతికే పనిలో ఉన్నారని ఇప్పటికే ఫిలింనగర్ లో వార్తల హడావిడి జరుగుతోంది.  ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తు నిఖిల్ పెట్టిన ఈ ట్విట్ అతడి పెళ్ళికి సంబంధించిందే అంటూ అప్పుడే చాలామంది ఊహలతో ఉన్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో పెళ్ళికాని బ్యాచిలర్స్ లిస్టు పెరిగి పోతూ ఉండటంతో నిఖిల్ కు నిజంగా పెళ్ళి కుదిరితే ఈ బ్యాచిలర్స్ లిస్టుకు కొంత మోక్షం లభిస్తుంది అంటూ అప్పుడే సెటైర్లు కూడా పడుతున్నాయి.  అల్లరి నరేష్, వరుణ్ సందేశ్, మంచు మనోజ్, రామ్, నితిన్, సందీప్‌కిషన్, రానా, ప్రభాస్ లతో రోజురోజుకు పెరిగిపోతున్న టాలీవుడ్ యంగ్ హీరోల బ్యాచలర్స్ లిస్టుకు నిఖిల్ మోక్షం కలిగిస్తాడో లేదో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: