మరి కొద్దిరోజులలో రాబోతున్న 2015 కు స్వాగతం పలుకుతూ అనంతపురానికి చెందిన బాలకృష్ణ అభిమానులు నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థ ‘ఎన్ బి కె హెల్పింగ్ హ్యాండ్’ విడుదల చేసిన 2015 సంవత్సరం క్యాలెండర్ వెబ్ మీడియాలో అందర్నీ ఆకర్షిస్తోంది. బాలకృష్ణ ‘లెజెండ్’ సినిమాలోని ఫోటోలే కాకుండా బాలయ్య ఇప్పటి వరకు నటించిన కొన్ని ముఖ్యమైన సినిమాలలోని గెటప్ లను ఈ క్యాలెండర్ లో ప్రచురించారు.ఈ సామాజిక సేవా సంస్థ బాలకృష్ణ ఆశయాలకు అనుగుణంగా రాయలసీమ జిల్లాలలో అనేక సామజిక సేవాకార్యక్రమలను విస్తృతంగా నిర్వహిస్తోంది. ఈ వార్తలు ఇలా ఉండగా ఇంకా నూతన సంవత్సరం రావడానికి మరికొన్ని రోజులు సమయం ఉన్నా బాలకృష్ణ తన అధికారిక లెటర్ ప్యాడ్ మీద తెలుగు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా విడుదల చేసారు. తెలుగు నేల మీద ప్రతి ఊర్లో, ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో ఉన్న నా ఆత్మీయ అభిమానులకీ, వారి కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ తెలుగు జాతి మధ్య అడ్డు గోడలు వచ్చాయి తప్ప తెలుగు వారి మధ్య తేడాలు లేవు అంటూ మనందరిదీ ఒకే జాతి, ఒకే బాట, ఒకే బాష అంటూ తెలుగు వారందరూ ప్రాంతాలకి అతీతంగా ఐక్యంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించాడు బాలయ్య. అంతేకాదు తనను చూసి తన అభిమానులు గర్వపడటం కాదని తన అభిమానులను చూసి తాను గర్వపడుతున్నానని అంటూ రాబోతున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాడు బాలకృష్ణ..   

మరింత సమాచారం తెలుసుకోండి: